Political News

వైరల్ పిక్ : ఒక చిరంజీవి.. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు!

తెలుగు సినీ రంగంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థాయిని సంపాయించుకున్న మెగాస్టార్ కు తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ‘ప‌ద్మ‌విభూష‌ణ్‌’ వంటి దేశ రెండో అత్యున్న‌త పౌర పుర‌స్కారాన్ని అందించింది. దీనిని పుర‌స్క‌రించుకుని తెలంగాణ ప్ర‌భుత్వం ఆయ‌న‌తో పాటు.. ప‌ద్మ అవార్డులు సొంతం చేసుకున్న‌వారిని తాజాగా ఘ‌నంగా స‌త్క‌రించింది. ఈ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఓ ఘ‌ట‌న ఇటు తెలంగాణ రాజ‌కీయాల్లోనూ సినీ వ‌ర్గాల్లోనేకాకుండా..అటు ఏపీలోనూ చ‌ర్చ‌నీయాంశం అయింది. ‘ఒక చిరంజీవి ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు’ ట్యాగ్‌తో దీనిపై సోష‌ల్ మీడియాలోనూ చ‌ర్చ‌సాగుతోంది.

ఏంటి విష‌యం?

ఈ ఏడాది ప‌ద్మ అవార్డులు పొందిన తెలుగు వారికి తెలంగాణ ప్ర‌భుత్వం ఘ‌న స‌త్కారం చేసింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ స‌త్కార కార్య‌క్ర‌మం ఆసాంతం క‌నుల పండువ‌గా సాగింది. ఆహ్లాదంగా, హుందాగా కూడా నిర్వ‌హించారు. ముఖ్యంగా సీఎం న‌నే భేష‌జాన్ని ప‌క్క‌న పెట్టి, త‌న హై ప్రొఫైల్, ప్రొటోకాల్ వంటివాటిని కూడా ప‌క్క‌న పెట్టి.. చాలా విన‌మ్రంగా, ఎంతో మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎం రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రించారు. క‌ళాకారుల‌కు మ‌రింత గౌర‌వాన్ని ఇనుమ‌డించేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌ధానంగా మెగాస్టార్ చిరంజీవి సీఎం రేవంత్‌కు న‌మ‌స్కారం చేసిన‌ప్పుడు ప్ర‌తిగా సీఎం రేవంత్ అంతే విధేయ‌త‌తో ప్ర‌తిన‌మ‌స్కారం చేశారు. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైర‌ల్ అవుతోంది.

ఏపీలో ఏం జ‌రిగిందంటే..

ఇదే మెగాస్టార్ చిరంజీవి.. గ‌త 2022లో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను కూడా క‌లిశారు. అప్ప‌ట్లో ఏపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీవో 35 పై ఆయ‌నతో చిరంజీవి చ‌ర్చించారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు అప్ప‌ట్లో ఇలానే వైర‌ల్ అయ్యాయి. కాగా, అప్ప‌ట్లో జీవో 35 ద్వారా.. ఏపీ ప్ర‌భుత్వం సినిమాల‌పై ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. కొత్త సినిమాల‌కు అప్ప‌టి వ‌ర‌కు ఉన్న టికెట్లు ధ‌ర‌లు పెంచుకునే అవ‌కాశం, బెనిఫిట్ షోలు ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం, ఒకేసారి ఎక్కువ ధియేట‌ర్ల‌లో ఆడించుకునే అవ‌కాశానికి కళ్లెం వేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అప్ప‌ట్లో ఈ విష‌యం పెద్ద చ‌ర్చ‌నీయాంశం..అదేస‌మ‌యంలో వివాదాస్పదం అయ్యాయి.

This post was last modified on February 5, 2024 6:42 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

1 hour ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

2 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

2 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

3 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

3 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago