Political News

అంతర్మథనం.. వైసీపీలోకి ఎందుకొచ్చాం?

తామున్న పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వగానే.. ఆ పార్టీ నుంచి నేతలు అధికార పార్టీలోకి జంప్ చేయడం మామూలే. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచాక ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వైకాపాలోకి నేతలు వలస వెళ్లారు. ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ చేశారు.

ఐతే గత ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పదవికి రాజీనామా చేయకుండా తమ పార్టీలోకి ప్రవేశం లేదని తేల్చేయడంతో జంప్ జిలానీ ఎమ్మెల్యేలకు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లయింది. అలాగని వైకాపాలోకి వలసలేమీ ఆగిపోలేదు.

పదవుల్లోలేని నేతలు పెద్ద ఎత్తున వైకాపాలోకి వెళ్లిపోయారు. పదవులున్న వాళ్లలో కూడా కొంతమంది అనధికారికంగా వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించే. వైకాపా కండువా కప్పుకోకపోయినా.. ఆయన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేగానే చూస్తున్నారు.

ఐతే వంశీ సహా వైకాపాలోకి వెళ్లిన చాలామంది నాయకులు ప్రస్తుతం అంతర్మథనంలో ఉన్నట్లు సమాచారం. వంశీ విషయమే తీసుకుంటే.. ఆయనకు వైకాపాలో ఆశించిన ప్రాధాన్యం దక్కట్లేదు. పార్టీ మారినందుకు ఆయనకు ఇచ్చిన హామీలేవీ సీఎం జగన్ నెరవేర్చలేదట. గన్నవరం నియోజకవర్గంలో వైకాపా నేతలు, కార్యకర్తలు వంశీకి ఏమాత్రం సహకరించడం లేదు. ఈయన నాయకత్వాన్నే వాళ్లు అంగీకరించట్లేదు. ఓవైపు హామీలు నెరవేరక, పనులు జరగక.. ఇంకోవైపు స్థానిక వైకాపా నాయకత్వంతో వర్గపోరుతో వంశీ విసిగిపోయినట్లు చెబుతున్నారు.

మరోవైపు చీరాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైకాపాలోకి అనధికారికంగా జంప్ అయిన కరణం బలరాం పరిస్థితి కూడా ఇలాగే ఉందట. అక్కడ వైకాపా తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణ మోహన్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉంది పరిస్థితి. మరోవైపు బలరాంకు సీఎం నుంచి అపాయింట్మెంటే దక్కట్లేదని సమాచారం.

టీడీపీలో ఉండగా ఒక వెలుగు వెలిగిన విజయవాడ నేత దేవినేని అవినాష్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నట్లు సమాచారం. తమ వ్యాపారాల్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వైకాపా కండువా కప్పుకున్న అవినాష్‌ను ఆ పార్టీలో పట్టించుకునేవాళ్లే కరవయ్యారు. ప్రకాశం జిల్లా నేత శిద్ధా రాఘవరావు పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.

అధికార పార్టీలో ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలుండటం.. ఆ పార్టీలోనే పదవులకు తీవ్రమైన పోటీ ఉండటం.. వర్గపోరు కొనసాగుతుండటంతో టీడీపీ నుంచి వచ్చిన నాయకులను పట్టించుకునేవాళ్లే కరవయ్యారు. దీంతో ఎందుకు పార్టీ మారామా అన్న అంతర్మథనం వలస నాయకుల్లో మొదలైనట్లు తెలుస్తోంది. కొత్తగా పార్టీ మారాలనుకుంటున్న వాళ్లను వీళ్లు నిరుత్సాహపరుస్తున్నట్లు సమాచారం.

This post was last modified on September 5, 2020 4:37 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

7 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

7 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

7 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

7 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

9 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

9 hours ago