కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా జనాలు ఎలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. వివిధ దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ కోసం కొన్ని నెలలుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్‌లు త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నాయి.
ఐతే వాటి కంటే ముందే రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలన్నీ పూర్తి చేసుకుని ప్రభుత్వ అనుమతులు కూడా పొందింది. దీన్ని ఇంకొన్ని రోజుల్లోనే మార్కెట్లోకి తేవాలనుకుంటున్నారు. ఈలోపు రెండు దశల్లో 76 మంది వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ వేశారు.
ఆ వ్యాక్సిన్ పని తీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అది సత్ఫలితాల్నే ఇచ్చిందని.. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించడం విశేషం. ‘స్పుత్నిక్-వి’ పేరుతో రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ఉపయోగించిన వారి శరీరాల్లో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని ఈ జర్నల్ వెల్లడించింది.
ఈ ఏడాది జూన్-జులై నెలల్లో రెండు దశల్లో 38 మంది చొప్పున మొత్తం 76 మందికి వ్యాక్సిన్ అందించారు. వారందరిలోనూ వంద శాతం యాంటీ బాడీలు ఉత్పత్తి అయినట్లు లాన్సెట్ పేర్కొంది. ఎవరీలోనూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని ఆ జర్నల్ పేర్కొనడం గమనార్హం.
ఐతే వ్యాక్సిన్‌ను దీర్ఘకాలంలో భద్రంగా, మరింత ప్రభావంతంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని పరీక్షలు, మరింత పర్యవేక్షణ అవసరం అని అభిప్రాయపడింది. ఐతే రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణుల్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. రష్యా ఏం చేసినా అనుమానంగా చూసే దేశాలు.. ఇంత త్వరగా ఆ దేశం వ్యాక్సిన్ వృద్ధి చేసిందంటే.. అది అన్ని రకాల ప్రమాణాలనూ అందుకుందంటే సందేహమే అన్నారు.
తొలి రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారమూ ఆ దేశం ప్రపంచంతో పంచుకోకపోవడం సందేహాలకు తావిచ్చింది. ఐతే ఇప్పుడు మెడికల్ జర్నల్ లాన్సెట్ ఈ వ్యాక్సిన్ గురించి సానుకూలంగా ప్రచురించడంతో రష్యాకు బలమొచ్చింది. మరి ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి ఎప్పుడొస్తుందో చూడాలి.
This post was last modified on September 5, 2020 8:49 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…