ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రకాశం జిల్లాలోని ఇటీవల పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఆ జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్.. తమ డిపార్ట్‌మెంట్ సిబ్బందిపై కొరఢా ఝులిపిస్తున్న తీరు సంచలనం రేపుతోంది.
పది రోజుల వ్యవధిలో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ 50 మందికి పైగా సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం గమనార్హం. ఇవన్నీ అవినీతి వ్యవహారాల వల్ల జరిగిన సస్పెన్షన్లే కావడం విశేషం.
ఒక జిల్లాలో పది రోజుల వ్యవధిలో ఓ ఎస్పీ 50 మందికి పైగా సొంత సిబ్బంది మీద సస్పెన్షన్ వేయడం అంటే సంచలనం కాక మరేమవుతుంది?
మొదట మంత్రి బాలినేని సొంత నియోజకవర్గం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ లక్ష్మణ్ పై వేటు వేశారు ఎస్పీ. పోలీస్ స్టేషన్లలో సివిల్ పంచాయతీలు, ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో సీఐపై వేటు పడింది.
తర్వాత కొన్ని రోజులకు, ఆగస్టు 28న అవినీతి ఆరోపణలు, అక్రమాలకు పాల్పడ్డారని, ప్రైవేట్ సెటిల్ మెంట్లు చేస్తున్నారని ఏకంగా 38 మంది పోలీస్ సిబ్బందిని ఒకే రోజు ఎస్పీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం రేపింది.
అంతే కాక వీరిపై విచారణ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఆరోపణలు నిజమని తేలితే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించడం చర్చనీయాంశమైంది.
సస్పెండైన పోలీసుల వివరాలు, వారిపై వచ్చిన ఆరోపణలను మీడియాకు రిలీజ్ చేయడం పోలీసు విభాగంలో కలకలం రేగింది. దీంతో ఎస్పీ మీద సొంత డిపార్ట్‌మెంట్లో వ్యతిరేక స్వరాలు పెరిగిపోయాయి.
మరో వైపు సరిగా పని చేయని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు సిబ్బందిని ఎస్పీ బదిలీ చేశారు. ఇలాంటి వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నారు. ఓ ఎస్పీ ఇంత దూకుడుగా, నిక్కచ్చిగా వ్యవహరించడం సినిమాల్లోనే చూస్తుంటాం. ఈ నేపథ్యంలో పలువురు మంత్రి బాలినేని వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా.. ఆయన ఎస్పీతో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
This post was last modified on September 4, 2020 7:59 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…