Political News

ఆర్థిక మంత్రిపై భర్త గారి షాకింగ్ కామెంట్స్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగింటి కోడలు అన్న సంగతి తెలిసిందే. ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీ కీలక నేతల్లో ఒకరు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్‌ భార్యే నిర్మల.

ప్రస్తుతం రైట్ ఫోలియో పేరుతో పొలిటికల్ అనాలసిస్, మార్కెట్ రీసెర్చ్ అనే కంపెనీ పెట్టుకుని దానికి ఎండీగా కొనసాగుతున్నారాయన. భార్య కేంద్ర మంత్రి అయినపుడు అక్కడి ప్రభుత్వానికి అనుకూలంగానే ఆయన వైఖరి ఉంటుందని ఎవరైనా అనుకుంటారు.

కానీ పరకాల ప్రభాకర్ మాత్రం ఉన్నట్లుండి కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా తన భార్య నడుపుతున్న శాఖ మీద విమర్శలకు దిగారు. కరోనా నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులకు లోనైన సంగతి తెలిసిందే. దీని కంటే ముందే ఆర్థిక వ్యవస్థ గాడి తప్పగా.. కరోనా దెబ్బకు కుదేలైపోయింది.

దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు దారుణంగా పడిపోయి.. నెగెటివ్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం అది మైనస్ 23 శాతంగా ఉంది. దీని గురించి ఇటీవల విలేకరులు అడిగితే.. అది మన చేతుల్లో లేదని.. ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అని పేర్కొంటూ కరోనా వల్లే ఇలా అయిందనే అర్థంలో మాట్లాడారు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్.

దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆమెపై వ్యంగ్యాస్త్రాలు పడుతున్నాయి. అలా కౌంటర్లు వేసేవాళ్లలో పరకాల ప్రభాకర్ సైతం చేరడం విశేషం. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ ఆయన.. ట్వీట్ వేశారు. ప్రభుత్వం సూక్ష్మ-ఆర్థిక సవాళ్లపై తగిన విధంగా స్పందించకపోవడమే అసలైన ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్’‌ అన్నారు.

ఆర్థిక పరిస్థితి గాడి తప్పడాన్ని తాను గత అక్టోబరులోనే ఊహించానని.. కరోనా ఆ తర్వాత వచ్చిందని.. ముందు వాస్తవాన్ని అంగీకరించని ప్రభుత్వానికి తాజాగా జీడీపీ వృద్ధిరేటు పడిపోవడంతో నిజం తెలిసొచ్చిందని వ్యాఖ్యానించారు ఇప్పటికైనా ఏదో ఒకటి చేసి దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలంటూ పరోక్షంగా తన భార్యకే చురక అంటించి సంచలనం రేపారు పరకాల.

This post was last modified on September 4, 2020 8:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాంగ్ టైంలో రిలీజ్… దెబ్బ కొడుతోందా?

తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…

4 hours ago

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

5 hours ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

5 hours ago

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

7 hours ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

7 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

7 hours ago