బీఆర్ఎస్ మళ్ళీ రివర్సవబోతోందా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు కేటీయార్ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో మెజారిటి నేతలు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చటం పెద్ద తప్పుగా చెప్పారట. తాజాగా ఎంఎల్ఏ కడియం శ్రీహరి మాట్లాడినపుడు కూడా టీఆర్ఎస్ స్ధానంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేయటం పెద్ద తప్పన్నారు. పార్టీ పేరులో నుండి తెలంగాణా ఎప్పుడైతే దూరమైందో అప్పుడే పార్టీకి జనాలు దూరమైనట్లు చాలామంది నేతలు స్పష్టంగా చెప్పారట.
అంటే ప్రత్యక్షంగానో లేకపోతే పరోక్షంగానో ఎన్నికల్లో ఓటమికి కేసీయార్ నిర్ణయాలే కారణమని చెప్పేస్తున్నారు. ఏ నియోజకవర్గం సమీక్ష నిర్వహించినా పార్టీ నేతలు, క్యాడర్ పూర్తిగా అగ్రనాయకత్వాన్నే తప్పుపడుతున్నారు. అధిష్టానం చేసిన తప్పులవల్ల, అనుసరించిన ఏకపక్ష విధానాలే పార్టీ ఓటమికి కారణమని స్పష్టంగా చెబుతున్నారు. దాంతో అగ్రనాయకత్వంపై పార్టీ నేతలు, క్యాడర్లో ఎంత మంటుందన్న విషయం బయటపడుతోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు నేతలు, క్యాడర్లో బయటపడుతున్న అసంతృప్తి రాబోయే ఎన్నికల్లో రిఫ్లెక్టవుతుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మెజారిటి నేతల ఆలోచనల ప్రకారం బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ అవుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కేసీయార్ కు మళ్ళీ ఎదురుదెబ్బ తప్పదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కేసీయార్ పాలనపై జనాగ్రహం ఇంకా తగ్గలేదని నేతలు సమీక్షల్లో ప్రస్తావిస్తున్నారట. పైగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడునెలల్లోపే పార్లమెంటు ఎన్నికలు జరుగుతుండటం కూడా బీఆర్ఎస్ కు పెద్ద సమస్యగా మారబోతోంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి ప్రజానుకూల నిర్ణయాలే తీసుకుంటున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కోటిగా అమల్లోకి తెస్తున్నారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలను గౌరవిస్తున్నారు. అన్ని వర్గాల జనాలకు అందుబాటులో ఉంటున్నారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే మొదలుపెట్టిన ప్రజాదర్బార్ (ప్రజావాణి) కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది. ముఖ్యమంత్రిగా కేసీయార్ పదేళ్ళ పాలనతో రేవంత్ నెలరోజుల పాలనను జనాలు పోల్చిచూసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి జనాభిప్రాయంతోనే కాంగ్రెస్ మెజారిటి సీట్లు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ కు కష్టాలు తప్పవనే అంచనాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on January 12, 2024 9:22 pm
కొన్ని రాజకీయ చర్చలు ఆసక్తిగా ఉంటాయి. ఆయా పార్టీల నాయకులు కూడా.. సుదీర్ఘకాలం చర్చించుకునేలా ఉంటాయి. అలాంటి రాజకీయ చర్చల్లో…
ఏపీ సీఎం చంద్రబాబు జపిస్తున్న పీ-4 మంత్రం గురించి తెలుసుకదా! పేదలను ధనికులుగా చేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.…
పూజా హెగ్డే.. ఒక దశలో టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా ఉన్న భామ. తమిళంలో కూడా ఆమెకు మంచి క్రేజే…
అభిమానులు వీలు దొరికినప్పుడంతా ఓజి ఓజి అంటూ జపం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ నిజానికది ఈ…
కూటమిలో ప్రధాన రోల్ పోషిస్తున్న టీడీపీ.. ఇటు పాలనపరంగా.. అటు అభివృద్ధి, సంక్షేమాల పరంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికి…
వైసీపీ అధినేత జగన్కు షాకిచ్చే పరిణామం. రాష్ట్రంలోని బీజేపీ-టీడీపీ-జనసేనల కూటమిని ఆయన ఎంత తేలికగా తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఈ…