Political News

‘జ‌గ‌న్ ని కాదు.. న‌న్ను చూసి గెలిపించండి ప్లీజ్‌’

వైసీపీలో కొత్త స్వ‌రం వినిపించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం జ‌గ‌న్ కోసం.. ఆయ‌న‌ను తిరిగి ముఖ్య‌మంత్రిని చేయ‌డం కోస‌మే తాము ప‌నిచేస్తున్నామ‌ని చెప్పుకొన్న నాయ‌కులు.. ఇప్పుడు ఒక్కొక్క‌రుగా స్వ‌రం మారుస్తున్నారు. సీఎం కాదు.. మ‌మ్మ‌ల్ని చూసి గెలిపించండి అంటూ.. పిలుపునిస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట‌.. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఇదే మాట వినిపించారు. అప్ప‌ట్లో ఈ వ్యాఖ్య‌లు వైసీపీలో మంట‌లు రేపాయి. దీనిపై ఆయ‌న అధిష్టానానికి వివ‌ర‌ణ కూడా ఇచ్చుకున్నారు.

అయితే.. ఆ విష‌యం మ‌రుగున ప‌డిందిలే అనుకునేలోగా.. తాజాగా అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌, విజ‌య‌న‌గరం ఎమ్మెల్యే, వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి కూడా ఇదే దారి ప‌ట్టారు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. “వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌న్ను చూసి గెలిపించండి. సీఎంను కాదు. జ‌గ‌న్ ఫొటోను చూసి కాదు. న‌న్ను, నా ప‌నితీరును చూసి గెలిపించండి” అని కోల‌గ‌ట్ల ప్ర‌క‌టించారు.

విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని ఉపాధ్యాయ‌, ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌తో తాజాగా ఆదివారం ఆయ‌న ర‌హ‌స్యంగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కోల‌గ‌ట్ల మాట్లాడుతూ.. “మీకు ప్ర‌భుత్వంపై పీక‌ల వ‌ర‌కు కోపం ఉంది. ఆ విష‌యం నాకు తెలుసు. మీ డిమాండ్లు ప‌రిష్కారం కాలేదు. మీరు సీఎం జ‌గ‌న్‌పై కోపంతో ఉన్నారు. అలాగ‌ని నాకు వ్య‌తిరేకం కావొద్దు. నేను మీ వాణ్ని. ఏ పార్టీలో ఉన్నా.. మీ కోసం ప‌నిచేస్తున్నాను. గ‌తంలోనూ మీకు మేలు చేశాను. సో.. న‌న్ను చూసి ఓటేయండి. సీఎం జ‌గ‌న్‌ను కాదు” అని ఆయ‌న చెప్పుకొచ్చారు.

మ‌రి ఈ వ్యాఖ్య‌లు ఏ మేర‌కు వీర‌భ‌ద్ర‌స్వామికి మేలు చేస్తాయో చూడాలి. అయితే.. మ‌రోవైపు వైసీపీ మాత్రం సీఎం జ‌గ‌న్‌ను చూపించే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని అభ్య‌ర్థుల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఒక‌రిద్ద‌రు(ఇప్ప‌టికి) మాత్రం త‌మ ను చూసి ఓటేయాల‌ని కోరుతుండ‌డం గ‌మ‌నార్హం

This post was last modified on January 8, 2024 3:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago