విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ దఫా గెలుపు పక్కా అని టీడీపీ రాసి పెట్టుకుంది. ఎందుకంటే.. ఇక్కడి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, నియోజకవర్గంతో గట్టి అనుబంధం పెంచుకున్న మల్లాది విష్ణును వైసీపీ పక్కన పెట్టింది. నియోజకవర్గతో సంబంధం లేని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ఇక్కడ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించింది. దీంతో టీడీపీ ఆశలు మరింతగా పెరిగాయి. వాస్తవానికి ఈ దఫా మల్లాది పోటీ చేసినా.. గెలుపు టీడీపీదేననే అంచనాలు వున్నాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాపై సానుభూతి వంటివి పనిచేస్తాయని భావించారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గెలుపు పక్కా అని టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చింది. 2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పులో విజయం దక్కించుకున్న టీడీపీ.. వైసీపీ హవాలోనూ తన నేత గద్దె రామ్మోహన్‌ను గెలిపించుకుంది. ఇక, సెంట్రల్ నియోజకవర్గం విషయానికి వస్తే.. గట్టి పోటీ ఇచ్చింది. టీడీపీ అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమా వర్సెస్ వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు మధ్య హోరా హోరీ పోరు సాగింది. కేవలంం 25 ఓట్ల తేడాతో మల్లాది విజయం సాధించారు.
దీనిని బట్టి సెంట్రల్లో టీడీపీ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. అయితే.. అప్పట్లో టీడీపీ ఇంతగా బలోపేతం కావడానికి ఎంపీ అభ్యర్థిగా ఉన్న ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని కారణమనే వాదన ఉంది. ఆర్థికంగా ఆయన బొండాకు ఎంతగానో సహకరించారనేది కూడా నిర్వివాదాంశం. ప్రచార ఖర్చుల నుంచి అంతో ఇంతో పంపిణీ వరకు కూడా కేశినేని నాని సహకరించా రని అంటారు. అయితే.. ఇప్పుడు నాని తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. తనకు టికెట్ ఇవ్వడం లేదని.. ఇక, తాను పార్టీలో ఉండనని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంపై ప్రభావం పడుతుందా? అనేది ప్రశ్న.
ఆర్థికంగా చూసుకుంటే.. కేశినేని సోదరుడు చిన్న అలియాస్ శివనాథ్ ఖర్చుకు వెనుకాడకపోయినా.. కేశినేని నాని.. ఇండిపెం డెంట్‌గా పోటీ చేసినా.. లేక బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసినా.. ఇక్కడ ప్రభావం పడే అవకాశం ఉంటుందని అంటున్నా రు. కేశినేని నాని అంటే.. రాజకీయంగా విమర్శలు, వివాదాలు పక్కన పెడితే.. అభివృద్ధి విషయంలో ఆయన సొంత ఇమేజ్ సంపాయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రభావం కనిపిస్తుందనేది అంచనా. అయితే.. ఇది సెంట్రల్‌లో టీడీపీని ఓడించేంత ఉండదని అంటున్నారు. అయితే.. నల్లేరుపై నడకగా ముందుకు సాగుతామని భావించిన టీడీపీ.. అంతో ఇంతో చెమటోడ్చక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on January 8, 2024 9:35 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…