ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలలుగా మందుబాబుల కష్టాలు మామూలుగా లేవు. లాక్ డౌన్ కారణంగా మూతపబడ్డ మద్యం దుకాణాలు.. రెండు నెలల తర్వాత తెరుచుకున్నాయి కానీ.. అంతకుముందున్న పేరున్న బ్రాండ్లన్నీ తీసి అవతల పడేశారు. పైగా మద్యం రేట్లు విపరీతంగా పెంచి అమ్మడం మొదలుపెట్టారు.
లాక్ డౌన్ వల్ల తలెత్తిన నష్టాన్ని పూడ్చుకునేందుకు తాత్కాలికంగా మద్యం ధరలు పెంచారని.. మళ్లీ తగ్గిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. అసలే ఊరూ పేరూ లేని లోకల్ బ్రాండ్లు. పైగా అధిక ధరలు. మామూలుగానే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటే.. ఇలాంటి బ్రాండ్లు తాగితే పరిస్థితి మరీ దారుణం అంటున్నారు నిపుణులు.
ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాల్లో మద్యం తెప్పించుకుని తాగుతున్నారు మందుబాబులు. ఈ మధ్య హైకోర్టు వేరే రాష్ట్రం నుంచి మూడు ఫుల్ బాటిళ్లు తెచ్చుకోవడానికి అనుమతి కూడా ఇచ్చింది.
దీంతో మందు బాబులు లోకల్ మద్యం దుకాణాలకు వెళ్లడం తగ్గించేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన మద్యాన్ని కొంచెం ఎక్కువ రేటు పెట్టి అయినా కొంటున్నారు. ఇది ఏపీ మద్యం ఆదాయంపై ప్రభావం చూపుతోందని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేత, విజయవాడ ఎంపీ క్యాండిడేట్ పొట్లూరి వరప్రసాద్.. ట్విట్టర్లో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
‘‘మందుబాబులు, కాస్త మన ఊళ్ళోనే కొనండ్రా!! ఆదాయం మన ఆంధ్రాకి ఇద్దాం.. పన్నులు తగ్గించారు, ఇక అంతా ఒకటే రేటు. కష్టకాలం అని ఎక్కువ తాగితే ఆరోగ్యానికే బొక్క. జర పైలం సుమీ..’’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఐతే ఈ ట్వీట్ మీద నెటిజన్లు చాలామంది విమర్శలు గుప్పించారు. మద్యపాన నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన పార్టీకి సంబంధించిన నేత.. మన ఊళ్లోనే మద్యం కొనండి, మన ఆంధ్రాకు ఆదాయం ఇవ్వండి అని అడగడమేంటి అని కొందరు ప్రశ్నిస్తే.. ఎక్కువ రేట్లు పెట్టి ఊరూ పేరూ లేని బ్రాండ్లు అమ్ముతూ.. మళ్లీ ఈ సమర్థింపు ఏమిటని అడిగారు.
This post was last modified on September 4, 2020 8:00 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…