మరో మూడు మాసాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి నినాదాల ప్రిపరేషన్‌లో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. టీడీపీ, వైసీపీలు ఈ విషయంలో దూకుడుగా ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి అనేక నినాదాలు హల్చల్ చేస్తున్నాయి. మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా నమ్మకం.. రావాలి జగన్, కావాలి జగన్.. వంటివి ఇప్పటికే పాపులర్ అయ్యాయి. ఇక, తాజాగా ఇస్తున్న నినాదాలు కూడా పార్టీని పరుగులు పెట్టిస్తున్నాయని నాయకులు అంటున్నారు. ‘వైనాట్ 175’ బాగా పాపులర్ అయింది.
జగన్ సారు మరో మారు.. నినాదం.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేవిధంగా జగనన్న.. మరో సారి నువ్వే అన్నా! నినాదానికి కూడా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గత ఎన్నికల సమయంలో పాటల రూపంలో దంచికొట్టిన ప్రచారాన్ని మరిపించేలా ఇప్పుడు కూడా అంతే స్థాయిలో ప్రచారం ఉండాలన్న లక్ష్యంతో వైసీపీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో సరికొత్త నినాదాల దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తల ను ముందుకు నడిపిస్తోంది.
ఇక, టీడీపీ కూడా కొత్త నినాదాలపై దృష్టి పెట్టింది. చంద్రన్న.. విజన్, ఏపీ భవితకు బాబు భరోసా, బాబు భరోసా.. భవిష్యత్తు గ్యారెంటీ వంటివి ప్రజల్లోకి బాగానే వెళ్లాయి. ఇక, ఉద్యమ నినాదాలు కూడా ప్రచారం లో ఉన్నాయి. అయితే.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని నినాదాల దిశగా పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఐటీడీపీ సహా ఎన్నారై టీడీపీ కూడా నినాదాల రూపకల్పన దిశగా కసరత్తు చేస్తున్నాయి.
ఇక, బీజేపీ మోడీ నినాదాన్నే ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించిన దరిమిలా.. కేంద్ర ప్రభుత్వ పథకా లకు మోడీ పేరును తొడిగి వాటితోనే ప్రచారం చేసుకోనున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ కూడా ‘వైనాట్ ఏపీ’ నినాదాన్ని తెరమీదికి తెచ్చిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే, తెలుగుపై పట్టు, రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారిని నియమించుకునేందుకు కూడా పార్టీలు రెడీగా ఉన్నాయట. మొత్తానికి ఒకవైపు పార్టీ వ్యూహలు.. మరోవైపు నినాదాల కసరత్తుతో అన్ని పార్టీలు బిజీబిజీగా ఉండడం గమనార్హం.
This post was last modified on December 27, 2023 9:20 pm
వైసీపీ నాయకుడు, గత వైసీపీ సర్కారులో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ యువ నాయకుడు, విజయవాడ…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధ…
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పటి వరకు…
వైసీపీ అధినేత జగన్కు ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) దెబ్బ కొత్తకాదు. ఆయనకు సంబంధించిన ఆస్తుల కేసులో ఈడీ అనేక మార్లు ఆయనను…
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న…
గత వారం విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ లో విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్ ప్రేక్షకుల…