కొద్ది రోజుల క్రితం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు ఒక మహిళ రావటం.. తనను పదేళ్లుగా 139 మంది అత్యాచారం చేసినట్లుగా ఫిర్యాదు చేయటం.. వంద పేజీలకు పైనే కంప్లైంట్ కాపీ ఉండటం.. అందులో పలు పేర్లు సినీ.. విద్యార్థి సంఘాలతో పాటు.. పలువురు మీడియా ప్రతినిధుల పేర్లు ఉండటం సంచలనంగా మారింది. అయితే.. మిగిలిన విషయాల మాదిరి ఈ కంప్లైంట్ ను హడావుడిగా బ్రేకింగ్ ల మీద బ్రేకింగ్ లు వేసి.. నానా రచ్చ చేయకుండా ఆచితూచి అన్నట్లుగా స్పందించింది.
రోజులు గడుస్తున్న కొద్దీ.. ఈ ఉదంతంలో కొత్త పేర్లు.. కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తనను మానసికంగా.. శారీరకంగా హింసకు గురి చేశారన్న మాటను బాధితురాలు పేర్కొంది. ఆమెకు అండగా ఒక ఎన్జీవో ఉండటం.. వారి కనుసన్నల్లోనే అంతా జరగటంపై కొంత అనుమానం వ్యక్తమైంది. విచిత్రంగా.. సదరు ఎన్జీవో సంస్థ అధినేత శ్రీకర్ రెడ్డి కారణంగానే తానీ పని చేయాల్సి వచ్చిందని.. తనను హింసకు గురి చేశారని.. తాను ఫిర్యాదు ఇచ్చినట్లుగా 139 మంది అత్యాచారం చేయలేదంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన వైనం సంచలనంగా మారింది. అందరి వేళ్లు.. డాలర్ భాయ్ వైపునకు మళ్లాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా డాలర్ భాయ్ రియాక్ట్ అయ్యారు. ఒక వీడియోను విడుదల చేసిన అతను.. తన తప్పేమీ లేదని.. తాను కూడా ఆమె బాధితుడినేనని.. డబ్బుల కోసమే ఆ పని చేస్తుందని చెప్పి మరో సంచలనానికి తెర తీశారు. చాలామందితో పాటు తనను కూడా హనీ ట్రాప్ చేసినట్లుగా సెల్ఫీ వీడియో ప్రజల ముందుకు వచ్చాడు.
తాను ఎక్కడికి పారిపోలేదన్న అతడు.. ఆ అమ్మాయి చెబుతున్న పేర్లలో అందరి వద్ద నుంచి ఆమె డబ్బులు వసూలు చేసిందని.. తాను చెప్పేది నిజమో.. అబద్ధమో తెలాలంటే.. ఆమె బ్యాంకు ఖాతాల్ని చెక్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయంటై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే పలు ట్విస్టులున్న ఈ ఉదంతం రానున్న రోజుల్లో మరెన్ని కొత్త మలుపులు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on September 2, 2020 5:06 pm
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…