ఎన్నికల వేళ ఆయా పార్టీల బలాబలాలను బట్టి.. పొత్తులు అనివార్యంగా మారుతున్న పరిస్తితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా పొత్తులకు తెరలెత్తుతున్నాయి. కానీ, ఎన్నికల వరకు తేల్చకపోవడం.. చివరి నిముషం వరకు సాగతీత ధోరణిని అవలంబించడం వల్ల ఆయా పార్టీలకు మేలు ఎంతన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది.
కానీ, ఈ పొత్తుల విషయంలో బీజేపీ నోటిఫికేషన్ వచ్చేసి.. ఇక, రేపో మాపో ఈ గడువు కూడా అయిపోతుందనగా .. అప్పుడు ఒక కొలిక్కి తెచ్చారు. దీంతో బీజేపీ ఆశించిన ఫలితం అయితే దక్కలేదు. పైగా జనసేనకు భారీ మైనస్ ఏర్పడింది. చివరి నిముషం వరకు ఈ పొత్తుల విషయం తెల్చకపోవడం.. అటు బీజేపీకి కూడా నష్టం చేకూర్చిందనే వాదన ఉంది. నాయకుల్లో నిరాశ, కేడర్‌లో నిస్సత్తువ ఆవరించాయి.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే.. ఇక్కడ పొత్తుల విషయాన్ని తేల్చేయాలని బీజేపీ నాయకులు అంతర్గత సంభాషణల్లో ప్రధానంగా తెరమీదికి తెస్తున్నారు. అంతేకాదు, ఏదో ఒక విషయాన్ని తేలిస్తే.. ప్రజల మైండ్ సెట్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు.
అలా కాకుండా.. కేవలం ఎన్నికలకు ముందు పొత్తులు తేల్చడం ద్వారా ప్రజలను పార్టీవైపు మళ్లించడం.. వారిని సానుకూలంగా తమవైపు తిప్పుకోవడం వంటివి ఇబ్బందికరమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విషయంలో అయినా.. ముందుగానే మేల్కొనాలనేది బీజేపీ నేతల టాక్. ఇదిలావుంటే.. టీడీపీ-జనసేనల పొత్తు ఓకే అయినా.. బీజేపీ కోసం ఇరు పక్షాలుద్వారాలు తెరిచే ఉంచాయి. అయితే, మోడీ ద్వయం మాత్రం పొత్తులపై లెక్కలు వేసేందుకు సమయం తీసుకుంటుండడం ఈ పార్టీలను కూడా ఇబ్బంది పెడుతోందనే టాక్ వినిపిస్తోంది.
This post was last modified on December 8, 2023 10:37 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…