ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు రోజులుగా చర్చనీయాంశంగా మారిన అంశం.. విశాఖపట్నంలో శ్రీకాంత్ అనే కుర్రాడికి శిరోముండనం చేయించడం. బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన నూతన్ నాయుడు కుటుంబం ఈ దళిత యువకుడికి బలవంతంగా గుండు కొట్టించిన ఉదంతం సంచలనం రేపింది.
తమ ఇంట్లో దొంగతనానికి పాల్పడి పని మానేశాడన్న కారణంతో నూతన్ కుటుంబం ఈ దారుణానికి ఒడిగట్టింది. సీసీ కెమెరాలో ఈ మొత్తం ఉదంతం రికార్డవడం, అది సోషల్ మీడియాలోకి రావడంతో దీనిపై పెద్ద దుమారమే రేగింది.
ఇంతకుముందే ఏపీలో ఓ దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన సంచలనం రేపింది. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో రాజకీయంగా వేడి రాజుకుంది.
మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అవుతున్న ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. నూతన్ నాయుడు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బాధిత యువకుడిని విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీకాంత్‌కు లక్ష రూపాయల నగదు, సొంత ఇల్లుతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వబోతున్నట్లు అవంతి శ్రీనివాస్ వెల్లడించడం గమనార్హం. ఈ మేరకు ఆయన అధికారులను ఆదేశించారు.
మంత్రి వెంట ఉన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా తన సొంత నగదు రూ.50 వేలను శ్రీకాంత్‌కు అందజేశారు. ఐతే రాజకీయ కోణంలో మంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 31, 2020 10:58 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…