Political News

రఘురామ ఎఫెక్ట్‌: సీఎం జ‌గ‌న్‌కు హైకోర్టు నోటీసులు

ఏపీ హిస్ట‌రీలో తొలిసారి కీల‌క ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది ముఖ్య‌మంత్రులు పాలించినా ఎవ‌రూ సాధించ‌ని ‘రికార్డు’ సీఎం జ‌గ‌న్ సాధించార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణంగా.. రాష్ట్ర హైకోర్టు ఆయ‌న‌కు నోటీసులు పంప‌డ‌మే. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన‌వారికి అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఏనాడూ జ‌ర‌గ‌లేదు. పైగా.. పాల‌న‌లో ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించి కావ‌డం మ‌రింత చ‌ర్చ‌నీయాంశం అయింది. కేవ‌లం సీఎం జ‌గ‌న్‌కే కాకుండా..ప‌లువురు మంత్రుల‌కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలో ప్ర‌జాధనాన్ని ఇష్టానుసారం ఖ‌ర్చు చేస్తున్నార‌ని.. ఈ క్ర‌మంలో స‌చివులు, సీఎం కూడా.. ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డ్డార‌ని ఆరోపిస్తూ.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ముఖ్యమంత్రి జగన్‌ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.

ర‌ఘురామ‌ ఆరోప‌ణ‌లు ఇవీ..

  • రాష్ట్రంలో అమలవుతున్న పథకాల మాటున ఆర్థిక అవకతవలు జరుగుతున్నాయి.
  • ఆ అవ‌క‌త‌వ‌క‌ల‌పై సీబీఐతో విచారణ జరిపించాలి.
  • ఇసుక‌, మ‌ద్యం విష‌యంలో భారీగా ధ‌నం చేతులు మారుతోంది.

This post was last modified on November 23, 2023 1:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేటీఆర్ వ్యాఖ్యలు ‘రియల్’పై పిడుగుపాటేనా..?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం…

55 seconds ago

మే వ‌ర‌కు ఆగుదాం.. జ‌గ‌న్ డెడ్‌లైన్‌!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే క్ర‌తువుకు డెడ్‌లైన్ పెట్టారు. ఇప్ప‌టికి రెండు సార్లు ఇలా…

1 hour ago

తీవ్రవాదుల వేటలో ‘జాక్’ సరదాలు

https://www.youtube.com/watch?v=orJ_CQ3VU28 డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ వరస బ్లాక్ బస్టర్లు ఇచ్చాక ఏడాది పైనే గ్యాప్ వచ్చేసిన సిద్ధూ జొన్నలగడ్డ…

1 hour ago

సుప్రీం చేరిన ‘సెంట్రల్’ పంచాయితీ.. కీలక ఆదేశాలు జారీ

తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా… హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములపైనే చర్చ నడుస్తోంది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూములు…

2 hours ago

కాంతార‌ చాప్టర్ 1 వాయిదా.. నిజ‌మేనా?

గ‌త కొన్నేళ్ల‌లో ఇండియ‌న్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సంచ‌ల‌నం అంటే.. కాంతార మూవీనే అని చెప్పాలి. కేవ‌లం రూ.16 కోట్ల…

2 hours ago

పుష్ప త‌మిళంలో అయితే ఎవ‌రితో..

టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ కెరీర్లో మిగ‌తా చిత్రాల‌న్నీ ఒకెత్త‌యితే.. పుష్ప‌, పుష్ప‌-2 మ‌రో ఎత్తు. ఈ రెండు చిత్రాలు…

3 hours ago