రాజకీయ పార్టీల్లో రకరకాల రాజకీయ నాయకులుంటారు. ఇటు అధిష్టానం, అటు ప్రజలను మెప్పించడంలో ఎవరి ప్రత్యేకత వారిది. కొందరు తమ వాగ్దాటితో నెగ్గుకు వస్తుంటారు. మరికొందరికి జనంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది….మరి కొందరు తమకున్న చాణక్య నీతితో ఇటు పార్టీ అధిష్టానాన్ని అటు కేడర్ ను, ప్రజలను మెప్పిస్తుంటారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో శివ కుమార్ ఈ తరహా నేతగా గుర్తింపు పొంది ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు.
కర్ణాటక కాంగ్రెస్ లోని నేతలు, కేడర్ మధ్య అంతర్గత కలహాలు, మధ్య చిన్న చిన్న గొడవలు సరిదిద్దదడంలో శివకుమార్ దిట్ట. అదే తరహాలో ఏపీలోని టీడీపీలో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకు ట్రబుల్ షూటర్ గా పేరుంది.
2014 ఎన్నికల్లో ఘన విజయం నుంచి 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం వరకు టీడీపీ అధిష్టానం అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేయడంలో సిద్ధహస్తుడిగా గన్నికి పేరుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ట్రబుల్ షూటర్ గన్ని వీరాంజనేయులుకు మరో కీలక బాధ్యతను అప్పగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రెడీ అయ్యారని టాక్ వస్తోంది.
వాస్తవానికి టీడీపీలో ప్రస్తుతం గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు వంటి పాతతరం నాయకులే ఎక్కువగా కనిపిస్తున్నారు. కొంతమంది కొత్తతరం నేతలు మీడియాలో కనిపించినా వారు వ్యూహకర్తలు కాదు. అయితే, వ్యూహకర్త అయి ఉండి కూడా మీడియాలో పెద్దగా వినిపించని నేత ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు.
మీడియా కంటే కూడా ప్రజలకు, పార్టీకి ఎక్కువ అందుబాటులో ఉండే నేతగా గన్నికి పేరుంది. ట్రబుల్ షూటర్ గా చంద్రబాబు నమ్మకాన్ని చూరగొన్న గన్ని….పార్టీ ఎదుగుదలకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే, టీడీపికి దొరికిన కొత్త ట్రబుల్ షూటర్ గన్నికి చంద్రబాబు కీలకమైన బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గం నుంచి 2014లో విజయం సాధించిన గన్ని వీరాంజనేయులుకు పార్టీలో నమ్మినబంటుగా పేరుంది. సాధారణ నేత నుంచి పార్టీలో కీలక వ్యూహకర్తగా ఎదిగిన వీరాంజనేయులుకు వివాదరహితుడిగా ముద్రపడింది. అందుకే, గన్నికి చంద్రబాబు అనేక కీలక బాధ్యతలు అప్పగించారు. నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు, 2018లో తెలంగాణలో జరిగిన అశ్వారావు పేట అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నిక…వీటన్నింటిలోనూ గన్ని వ్యూహాలతో టీడీపీ విజయం సాధించింది.
దీంతోపాటు, ఉంగుటూరులో కేడర్‌కు ఎల్లపుడు అందుబాటులో ఉండడం గన్ని ప్రత్యేకత. ఇక, టీడీపీ కేడర్ ని వైసీపీ ఇబ్బందలుపెడుతున్నా, కేసులు పెడుతున్నా…దీటుగా ఎదుర్కొంటున్నారు గన్ని. పోలవరం నియోజకవర్గంలో, చింతలపూడిలోనూ పార్టీలో అసంతృప్తులను చక్కదిద్ది కేడర్ ను గాడిలో పెట్టడం వంటి పనులు గన్ని అనేకం చేశారు.
ఇలా ట్రబుల్ షూటర్ గా పేరున్న గన్నికి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల విభజన ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో వైసీపీ పార్లమెంటరీ జిల్లాల వారీగా పార్టీ కమిటీలు నియమిస్తోంది. దీంతో, టీడీపీ కూడా అదే బాటలో పయనించాలని భావిస్తోందట.
This post was last modified on August 29, 2020 10:52 am
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…