తెలంగాణ గవర్నర్ తమిళసై గవర్నర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఎంపీకి బాబాయి వరుస అయ్యే కన్యాకుమారి కాంగ్రెస్ పార్టీ ఎంపీ హెచ్ వసంత్ కుమార్ కరోనాతో మరణించారు. కరోనా సోకడంతో అయన ఆగష్టు 10 వ తేదీన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తీసుకుంటూ కొద్దిసేపటి క్రితమే మరణించారు. కరోనాతో మృతి చెందిన తొలి ఎంపీ వసంత్ కుమార్.
వసంత కుమార్ జీవితంలో అనేక ఆసక్తికర ఘట్టాలు ఉన్నాయి. సేల్స్ మెన్‌గా ప్రయాణం ప్రారంభించి వ్యాపారవేత్త స్థాయికి ఎదిగారు. వసంత్ కుమార్ తమిళనాడుతో పాటుగా పుదుచ్చేరిలో వసంత్ అండ్ కో ఎలక్ట్రానిక్ అండ్ కో హోమ్ స్టోర్స్ ను నిర్వహిస్తున్నారు. సొంతంగా ఆయనకు వసంత్ శాటిలైట్ టీవీ ఛానల్ కూడా ఉంది. వసంతకుమార్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయనకు కరోనా సోకడంతో ఆగస్టు 10న అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈరోజు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై కి హెచ్ వసంత్ కుమార్ బాబాయ్ అవుతారు.
ఎంపీ వసంత్ కుమార్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.‘లోకసభ ఎంపి శ్రీ హెచ్. వసంతకుమార్‌జీ మరణ వార్త తెలిసి బాధపడ్డాను. వ్యాపారం, సామాజిక సేవలో ఆయన ఎంతో ప్రగతి సాధించారు. ఆయనతో నేను పలుమార్లు చర్చించినప్పుడు.. ఎక్కువగా తమిళనాడు అభివృద్ధి గుచించే మాట్లాడేవారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా సంతాపం తెలియజేస్తున్నా. ఓం శాంతి’ అని మోదీ ట్వీట్ చేశారు.
కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరారు. ఎంపీలందరూ విధిగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో వైరప్ వ్యాప్తికి అవకాశం లేని విధంగా పార్లమెంట్‌లో సీటింగ్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ముందు జాగ్రత్తగా సభ్యులందరికీ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఓం బిర్లా తెలిపారు. దీని వల్ల ఒకటి, రెండు రోజుల్లోనే రిపోర్టు తెలుస్తుందని అన్నారు.
This post was last modified on August 28, 2020 11:01 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…