రాజకీయాల్లో కుటుంబ రాజకీయాలు ఉంటాయి. భార్యాభర్త ఒకే పార్టీలో ఉండడం సహజం. అన్నదమ్ము లు కూడా ఒకే కండువా కప్పుకోవడం తెలిసిందే. ఇక, రాజకీయ గురువులు-శిష్యులు కూడా ఒకే పార్టీలో ఉండడం తెలిసిందే. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా.. రాజకీయాలు కూడా మారిపోయాయి. టికెట్ దక్కితే చాలు.. అది ఎవరైనా ఫర్వాలేదనే వాదన వినిపిస్తోంది. భార్య ఒక పార్టీలో భర్త మరోపార్టీలో, అన్న ఒక పార్టీలో తమ్ముడు మరో పార్టీలో, గురువు ఒక పార్టీలో శిష్యుడు మరో పార్టీలో ఉంటున్నారు.
దీంతో రాజకీయాల స్వరూపం మారిపోతోంది. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి అధికార పార్టీ బీఆర్ ఎస్ తరఫున బరిలో ఉన్న దానం నాగేందర్‌కు ఇదే సమస్య ఎదురైంది. తనకు రాజకీయ భిక్ష పెట్టి, నలుగురి లోనూ గుర్తింపు తెచ్చిన పీజేఆర్‌ను ఆయన గురువుగా భావిస్తారు. అయితే.. ఇప్పుడు ఆయన కుమార్తె విజయారెడ్డిపైనే దానం పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె ఇక్కడ నుంచి చావో రేవో తేల్చుకునే పనిలో ఉన్నారు.
ఈ క్రమంలో ప్రధాన పోటీ బీఆర్ ఎస్ అభ్యర్థి దానం, కాంగ్రెస్ అభ్యర్థి విజయల చుట్టూనే తిరుగుతోంది. విజయ కొంత దూకుడు చూపించి.. దానం ఇక్కడ చేసింది ఏమీ లేదని చెబుతున్నారు. మురుగు కాల్వలను చూపిస్తున్నారు. చిన్న వర్షానికే ఖైరతాబాద్ మునిగిపోతోందంటూ.. కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతున్నారు. అంతేకాదు.. నగరంలో కీలకమైన నియోజకవర్గాన్ని దానం పక్కన పెట్టేశారని చెబుతున్నారు.
అయితే, ఇదే సమయంలో విజయను నేరుగా ఏమీ అనలేక.. దానం సతమతం అవుతున్నారు. రాజకీయా ల్లో వన్స్ పోటీ అంటూ ఏర్పడితే.. అది ఎవరైనా విమర్శలు గుప్పించుకోవాల్సిందే. కానీ, దానం నాగేందర్‌కు మాత్రం.. గురువు పీజేఆర్ పదే పదే గుర్తుకు వస్తున్నారు. ఇప్పటి వరకు పీజేఆర్‌ను కానీ, ఆయన కుటుంబాన్ని కానీ, ఆయన పన్నెత్తు మాట అనలేదు. కానీ, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా ఉండడంతో అనలేక.. కాదనలేక ఇబ్బంది పడుతున్నారట.
ఈ క్రమంలోనే ఆయన విజయ పేరు కానీ.. పీజేఆర్ పేరు కానీ.. ఎత్తకుండా.. పార్టీలు మారేవారికి ప్రజలు ఓటేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. కానీ, చిత్రం ఏంటంటే.. ఈయన కూడా పార్టీ మారిపోయి.. బీఆర్ ఎస్‌లో చేరిన నాయకుడే. దీంతో దానం ప్రచారం కొంత నెమ్మదిగా సాగుతోందని అంటున్నారు పరిశీలకులు. మరి వచ్చే 20 రోజుల్లో దూకుడు పెంచుతారేమో చూడాలి.
This post was last modified on November 10, 2023 10:27 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…