Political News

ప్రచార పంథాలో కేటీఆర్ మార్కు

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు అధినేత కేసీఆర్ కష్టపడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి పాటుపడుతున్నారు. వివిధ నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటూ ప్రజల ఓట్లను మరోసారి సాధించే దిశగా సాగుతున్నారు. తన సొంత నియోజకవర్గంలో సిరిసిల్లాలో పరిస్థితిని సమన్వయం చేసుకుంటూనే.. మరోవైపు ఇతర అభ్యర్థుల విజయం కోసం వ్యూహాల్లో కేటీఆర్ మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ప్రచారంలో కేటీఆర్ కొత్త ట్రెండు క్రియేట్ చేశారనే చెప్పాలి.

ఇప్పటికే సభలు, సమావేశాలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రచారాన్ని కేటీఆర్ హోరెత్తిస్తున్నారు. అటు సామాజిక మాధ్యమాల్లోనూ కాంగ్రెస్, బీజేపీ వైఖరిని దుయ్యబడుతూ.. ఆ పార్టీలకు అవకాశం ఇవ్వొద్దని, బీఆర్ఎస్ నే గెలిపించాలని కోరుతున్నారు. ఇప్పుడికి యూట్యూబ్ పై కేటీఆర్ ఫోకస్ పెట్టారనే చెప్పాలి. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ లో కేటీఆర్ సందడి చేశారు. ఓ గ్రామంలో నాటుకోడి కూర వండి, దీన్ని తింటూ తమ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్, అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. ‘మై విలేజ్ షో’.. గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన యూట్యూబ్ ఛానెల్ ఇది. దీనికి సంబంధించిన వాళ్లే ఇప్పుడు ‘కల్లివెల్లి’ అని మరో ఛానెల్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడీ ఛానెల్ లో కేటీఆర్ తళుక్కుమన్నారు. ఆ గ్రామంలో ఛానెల్ యువకులు, గంగవ్వ, అంజిమామతో కలిసి కేటీఆర్ సందడి చేశారు.

పొలాల మధ్యలో చికెన్ వండి, దీన్ని తింటూ కనిపించారు. ఈ క్రమంలో పదేళ్లుగా వివిధ రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్, తెచ్చిన సంక్షేమ పథకాలను కేటీఆర్ వివరించారు. ఎన్నికల నేపథ్యంలో దొరికిన ప్రతి అవకాశాన్ని కేటీఆర్ సమర్థంగా వాడుకుంటున్నారనేందుకు ఇదే నిదర్శనం. ఈ వీడియోలో తమ ప్రభుత్వ పాలన గురించి చెప్పిన కేటీఆర్ ఎక్కడా బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరకపోవడం గమనార్హం. అయితే చేసిన డెవలప్మెంట్ చూసి ప్రజలే ఓట్లు వేస్తారన్నది కేటీఆర్ ఆలోచన. ఈ ఛానెల్ కు ఇప్పుడు 4.72 లక్షల సబ్ స్క్రైబర్లున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 11 లక్షలకు పైగా మంది వీక్షించారు. గ్రామాలు, పట్టణాల్లోని యువత, పెద్దవాళ్లు అనుసరించే ఈ ఛానెల్ లో ఈ వీడియోతో బీఆర్ఎస్ కు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రచారం దొరుకుతుందనడంలో సందేహం లేదు.

This post was last modified on November 5, 2023 5:38 pm

Share

Recent Posts

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

15 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

8 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

9 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

11 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

11 hours ago