ఆంధ్రప్రదేశ్ సర్కారుకు హైకోర్టులో ఎదురు దెబ్బ.. జగన్ సర్కారుకు సుప్రీం కోర్టు షాక్.. ఇలాంటి వార్తలు గత ఏడాది కాలంలో ఎన్ని వచ్చాయో లెక్కే లేదు. ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని కోర్టు సమర్థిస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది తప్ప.. కోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలితే అది వార్తగానే అనిపించట్లేదు. ఇది మామూలే కదా అనుకునే స్థాయిలో జగన్ సర్కారుకు కోర్టులో ఎదురు దెబ్బలు తగిలాయి. తాజాగా రాజధాని వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు మొదలయ్యాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనకు ఏపీ హైకోర్టు బ్రేక్ వేయడం ఖాయం అని అందరూ అనుకుంటుండగా అదే జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి గురువారం ఏకంగా కోర్టులో ఏపీ ప్రభుత్వానికి పలు నిర్ణయాలు వ్యతిరేకంగా రావడం గమనార్హం.
ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పులు
1 తూర్పు గోదావరి జిల్లాలోని అవ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సిబిఐ కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
2 రాజధాని రైతుల కౌలు రెండురోజుల్లో చెల్లించాలి అని ఆదేశించిన హైకోర్టు.
3 టీడీపీ మాజీ ఎమెల్యే పోతుల రామారావు గ్రానైట్ సంస్థకు ఇచ్చిన పన్ను నోటీసులు రద్దు చేసిన హైకోర్టు – లీజు రద్దు నోటీసులు కూడా డిస్మిస్ – సదరన్ రాక్ అండ్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు గతంలో పన్ను, లీజు రద్దు నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం – ఈ నోటీసులను హైకోర్టులో సవాల్ చేసిన పోతుల రామారావు – ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు చట్టబద్దంగా లేవన్న హైకోర్టు
4 గెస్ట్ హౌస్ శంఖుస్థాపన తో హైకోర్టు ధిక్కారం చేశారని వేసిన పిటిషన్ లో చీఫ్ సెక్రటరీ కి నోటీసులు ఇచ్చిన కోర్ట్.
5 మూడు రాజధానులు మరియు CRDA చట్ట రద్దు కేసులో సెప్టెంబర్ 21 నుంచి రోజువారీ విచారణ కొనసాగించడానికి న్యాయవాదులతో చర్చించిన హైకోర్టు.
కౌంటర్ దాఖలు చేయడానికి 10 వరకూ ప్రభుత్వానికి గడువు. అభ్యంతరం దాఖలు చెయ్యడానికి 17 వరకూ పిటిషనర్లకు సమయం. రాజధాని మార్పుపై స్టేటస్ కో సెప్టెంబర్ 21 వరకూ కొనసాగింపు.
This post was last modified on August 27, 2020 10:58 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…