మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం ఘటన తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రభాకర్ పై దాడిని కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఆ దాడిని తన మీద దాడిగా పరిగణిస్తానని ఆయన అన్నారు. చేతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు, చేతగాని వెధవలు ప్రభాకర్ రెడ్డిని కత్తితో పొడిచి దారుణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఇది రాజకీయమా? ఇంత అరాచకమా? అని ప్రశ్నించారు.
వాస్తవానికి తాను ప్రభాకర్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లాలనుకున్నానని, కానీ, హరీశ్ రావు, మిగిలిన మంత్రులు అక్కడే ఉన్నట్లు చెప్పడంతో సభకు వచ్చానని అన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డికి ప్రాణాపాయం లేదని, సభలను ముగించుకొని రావాలని తనకు సూచించారని చెప్పారు. బాగా పని చేసే నాయకులను ఎన్నికలలో ఎదుర్కొనే దమ్ములేని వారు కత్తులతో దాడులకు దిగారని ధ్వజమెత్తారు. దాడి చేసిన వారికి తెలంగాణ సమాజం తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. ఇలాంటి దాడులు ఆపకపోతే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తాము ప్రజాసేవ గురించి ఆలోచిస్తున్నామని, మీరు దుర్మార్గమైన పనుల్లో ఉన్నారని విపక్షాలపై మండిపడ్డారు. పదేళ్లలో ఎన్నో ఎన్నికలు జరిగినా ఎప్పుడూ ఇలాంటి హింస జరగలేదని, తమ సహనాన్ని పరీక్షిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మరోవైపు, హరీష్ రావుకు ఫోన్ చేసి ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ ఆరా తీశారు.
కాగా, ఈ దాడి ఘటనపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తమిళిసై ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.
This post was last modified on October 30, 2023 10:50 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…