Political News

మాధ‌వ్‌తో మ‌రింత డ్యామేజీ

ఏ పార్టీలో అయినా.. దూకుడుగా ఉండే నాయ‌కులు ఉంటారు. అదేవిధంగా హ‌ద్దులు దాటే నాయ‌కులు కూడా ఉంటారు. అయితే.. మ‌రీ దారుణంగా వ్య‌వ‌హ‌రించ‌డం.. స‌మాజంలో క‌ల్లోల ప‌రిస్థితులు సృష్టించేలా రాజ‌కీయాలు చేయ‌డం అంటే.. అది ఏపార్టీకైనా ఇబ్బందిక‌ర‌మే. ఇప్పుడు ఏపీ అధికార పార్టీ కూడా ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న‌ట్టు ఆ పార్టీ నేత‌లే వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

వాస్త‌వానికి వైసీపీలో చాలా మంది ఫైర్ బ్రాండ్ నాయ‌కులు ఉన్నారు. అదేవిధంగా బూతులు మాట్లాడే నాయకులు కూడా ఉన్నార‌ని టీడీపీ నాయ‌కులు త‌ర‌చుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. వీరి ప‌రిస్థితి ఎలా ఉన్నా.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ చేష్ఠ‌ల‌తో పార్టీ ప‌రిస్థితి దారుణంగా మారింద‌ని.. తాము తలెత్తుకోలేక పోతున్నామ‌ని.. ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గం పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది.

గ‌తంలో మాధ‌వ్‌.. న్యూడ్ వీడియో క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఎవ‌రో మ‌హిళ‌తో ఆయ‌న న్యూడ్ కాల్ చేయ‌డం.. ఇది సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ కావ‌డం అంద‌రినీ సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేసింది. దీనిపై పార్టీలోనూ అంత‌ర్గ‌త నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. అయితే.. బీసీ(కుర‌బ‌) సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో అప్ప‌ట్లో ఈ ఘ‌ట‌న‌ను వైసీపీ లైట్ తీసుకుంది. కానీ, క్షేత్ర‌స్థాయిలో మ‌హిళ‌లు ఇప్ప‌టికీ ఎంపీని ఏవ‌గించుకుంటూనే ఉన్నారు.

దీంతో ఎంపీ మాధ‌వ్ రెండేళ్లుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇదిలావుంటే, తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై ఆయ‌న చేసిన వికృత వ్యాఖ్య‌లు మ‌రింత‌గా వైసీపీని డ్యామేజీ చేయ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు త‌ల ప‌ట్టుకున్నారు. చంద్ర‌బాబు అరెస్టు ద‌రిమిలా ఇప్ప‌టికే వైసీపీని ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని, ఉద్దేశ పూర్వ‌కంగానే బాబును జైల్లో పెట్టార‌ని అంద‌రూ అనుకుంటున్నార‌ని.. ఇప్పుడు ఏకంగా చంద్ర‌బాబు ఛ‌స్తాడు అని వ్యాఖ్యానించి పార్టీని మ‌రింత ఇర‌కాటం లో పెట్టార‌ని సీనియ‌ర్ నాయ‌కులు త‌ల్ల‌డిల్లుతున్నారు. ఇలాంటి వారు పార్టీకి అవ‌స‌ర‌మా? రేపు ప్ర‌జ‌ల్లోకి ఏమొహం పెట్టుకుని వెళ్లాల‌నివారు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి పార్టీ అధిష్టానం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో చూడాలి.

This post was last modified on October 28, 2023 12:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago