అవసరం రావాలే కానీ.. అప్పుడెప్పుడో వదిలేసిన పాత సంబంధాల్ని సైతం సరికొత్తగా కలుపుకునే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మించిన టాలెంట్ మరెవరికీ లేదంటారు. ఒకసారి అవసరం అయిపోయినా.. అనుకున్నది అనుకున్నట్లుగా జరగకున్నా.. అప్పటివరకు నెత్తిన పెట్టుకునే వారిని పూర్తిగా పట్టించుకోవటం మానేసే విషయంలోనూ ఆయన పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. గత ఏడాది లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. సీఎం కేసీఆర్ ఒక పెద్ద మనిషి ఇంటికి భోజనానికి వెళ్లటం హాట్ టాపిక్ మారింది.
ఒకప్పడు కేసీఆర్ కు మాంచి దోస్తు.. టీడీపీలో సుదీర్ఘంగా ఉన్న సీనియర్ నేత.. వివాదాలకు దూరంగా ఉండే నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావు అనూహ్యంగా గులాబీ కారు ఎక్కటం ఆశ్చర్యానికి గురి చేసింది. నిజామాబాద్ బరిలో ఉన్న తన కుమార్తె కవితకు దన్నుగా నిలవటమే కాదు.. మండవకున్న మంచిపేరు.. ఫ్యాన్ ఫాలోయింగ్ కవితకు ఓట్ల రూపంలో బదిలీ అవుతుందని ఆశించారు.
సారు అంచనాలకు భిన్నంగా నిజామాబాద్ ఓటర్లు తీర్పు ఇవ్వటం.. పక్కాగా గెలుస్తుందని భావించిన కవిత.. ఎన్నికల్లో ఓటమి పాలు కావటంతో సీఎం కేసీఆర్ తీవ్రమైన నిరాశకు గురైనట్లుగా చెబుతారు. దీంతో.. మండవ ప్రాధాన్యత పార్టీలో తగ్గినట్లు చెబుతారు. ఎన్నికల వేళలో.. తానే స్వయంగా మండవ ఇంటికి వెళ్లి.. భోజనం చేసిన కేసీఆర్ ఆ తర్వాత ఆయన్ను పట్టించుకోలేదన్న విమర్శ ఉంది.
ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు (సురేశ్ రెడ్డి, మండవ) ఉన్నప్పటికీ.. మొన్నటికి మొన్న రాజ్యసభ స్థానం సురేశ్ రెడ్డికి దక్కింది. మండవకు రిక్త హస్తమే దక్కిన విషయంలోనూ ఆయన నిరాశకు గురైనట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో ఉండటంతో పెద్దగా ప్రయోజనం లేదన్న విషయాన్ని మండవ గుర్తించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు.. బీజేపీ నుంచి రిక్వెస్టుల మీద రిక్వెస్టులు పెరిగిపోయినందున.. తాను కారు దిగేసి.. కమలానికి దగ్గర కావాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
మండవకు పదవి ఇచ్చినా.. ఇవ్వకున్నా ఫర్లేదని.. అధినేత కేసీఆర్ ఆయన్ను గుర్తిస్తున్నట్లుగా వైఖరి ఉంటే సరిపోతుందంటున్నారు. మరి.. అలాంటి వాటికి కేసీఆర్ సిద్ధంగా ఉండే అవకాశం లేని నేపథ్యంలొ.. మండవ కీలక నిర్ణయాన్ని తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. మరి.. తన పాత దోస్తును కేసీఆర్ వదులుకుంటారో? లేదో? కాలమే డిసైడ్ చేయాల్సి ఉంది. ఒకవేళ అలాంటిదే జరిగి మండవ కారు దిగేస్తే మాత్రం సీఎం కేసీఆర్ కు ఇబ్బందేనని చెబుతున్నారు.
This post was last modified on August 27, 2020 10:09 am
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…