కొన్ని కొన్ని సార్లు రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు వారికి బూమరాంగ్‌గా మారతాయి. ఇప్పుడు తలపండిన రాజకీయ నేతగా బీఆర్ ఎస్ నాయకులు భావించే సీఎం కేసీఆర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు.. ఆయనకే ఎదురు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అచ్చంపేటలో గురువారం నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
“మీరు మమ్మల్ని గెలిపిస్తే.. మీకు మంచి పాలన, పథకాలు అందిస్తాం. ఇప్పుడు ఇస్తున్న వాటికంటే.. ఎక్కువగా మేలు చేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీరు మమ్మల్ని ఓడగొడితే.. ఏం చేస్తం.. ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటాం. కానీ, నష్టపోయేది మాత్రం మీరే. కాంగ్రెస్ రాబందులు మిమ్మల్ని పీక్కుతింటై” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే.. ఓడిపోయినా.. కూడా ప్రజల కోసం నిలబడతాం.. వారి సమస్యలపై పోరాటం చేస్తాం.. అని చెప్పాల్సిన కేసీఆర్.. ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటామని వ్యాఖ్యానించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తున్నాయి.
అదేసమయంలో నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్నారు. ఈ సారికి ప్రతిపక్షంలోకి వస్తే.. ఇంటికెళ్లి రెస్టు తీసుకుంటారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరింత దూకుడుగా కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. “బైబై కేసీఆర్. నువ్వు ఓడిపోవుట ఖాయం.. ఫామ్ హౌస్‌ల రెస్టు తీసుకొనుడు ఖాయం.. బైబై కేసీఆర్” అంటూ.. రేవంత్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల క్లిప్‌ను ఆయన ట్వీట్‌కు జత చేశారు.
This post was last modified on October 27, 2023 7:10 pm
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాదాపు ఒకే మాట చెప్పుకొని…
ఇప్పటిదాకా ప్యాన్ ఇండియా మూవీస్ కే ఎక్కువ పరిమితమైన టికెట్ రేట్ల పెంపు మెల్లగా మీడియం బడ్జెట్ సినిమాలకు వచ్చేస్తోంది.…
ఆదీవాసీ సమాజానికి ఐకాన్‌గా కనిపిస్తున్న ఏకైక నాయకుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆదివాసీలు(గిరిజనులు) నివసిస్తున్న గ్రామాలు,…
తెలంగాణలో పెద్ద సినిమాలకు టికెట్ల ధరలు పెంచడం, ప్రీమియర్ షోలు వేయడం గురించి ఏడాది కిందట్నుంచి పెద్ద చర్చే జరుగుతోంది.…
చాలా కాలంగా నిర్మాతలను వేధిస్తున్న సమస్య బుక్ మై షో రేటింగ్స్, రివ్యూస్. టికెట్లు కొన్నా కొనకపోయినా ఇవి ఇచ్చే…
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…