ఏపీ హైకోర్టులో మరోమారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై అదే పార్టీకి చెందిన నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజుపాలెం వైసీపీ కార్యకర్తల తరపున హైకోర్టు న్యాయవాది ఎం.నాగరఘు ప్రజా ప్రయోజవ్యాజ్యం దాఖలు చేశారు.
రాజుపాలెం మండలం కోట నెమలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్ జరిగిందని ఈ పిటిషన్లో ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. కలెక్టర్, మంత్రి పెద్దిరెడ్డి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్లు పంపినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మైనింగ్ అధికారులు విచారణ జరిపారని పిటిషనర్లు పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలు వేస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టుకు పూర్తి వివరాలు చెప్పాల్సిన భాధ్యత తనపై ఉందని న్యాయవాది నాగరఘు పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి విచారణ జరపాలని ఆదేశించినా పట్టించుకోలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
కాగా, వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలపై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు కేసు విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. కాగా, సాక్షాత్తు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై సాక్షాత్తు పార్టీ నేతలే ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
This post was last modified on August 26, 2020 7:59 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…