Political News

చిటికేసి సవాల్ చేసిన రఘురాముడు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మీడియా ముందుకొచ్చి మాట్లాడితే.. అందరూ తన వైపు ఆసక్తిగా చూసేలా చేయగల నాయకుడు ఎవరు అంటే మరో మాట లేకుండా రఘురామకృష్ణం రాజు పేరు చెప్పేయొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిపక్షాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కంటే ఎక్కువగా విరుచుకుపడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు ఆ పార్టీకే చెందిన ఈ ఎంపీ.

ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు కూడా చేయించుకున్న రఘురామ.. అప్పట్నుంచి మరింతగా స్వరం పెంచుతున్నారు. తాజాగా ఆయన మరోసారి ఏపీ అధికార పార్టీ, ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. వైకాపా నేతల నుంచి తనతో పాటు వివిధ వర్గాల వాళ్లకు వస్తున్న బెదిరింపులు, వేధింపుల గురించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. మీ బెదిరింపుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటూ ఆయన చిటికేసి వైకాపా నేతలకు సవాలు విసిరారు.

పీపీఈ కిట్లు లేవని ఎప్పుడో కామెంట్ చేసిన డాక్టర్ గంగాధర్ లాంటి ప్రముఖ వైద్యుడికి ఇప్పుడు సెక్షన్ 41 కింద నోటీసులు ఇవ్వడమేంటని రఘురామ ప్రశ్నించారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా, మృధుభాషిగా డాక్టర్ గంగాధర్‌కు పేరుందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు నోరు విప్పినా భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.

ఓ దళిత యువకుడు మద్యంపై మాట్లాడితే ఆ వ్యక్తిని వైసీపీ కార్యకర్తలు చంపుతామని బెదిరిస్తే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలొస్తున్నాయని.. ఇలా ప్రాణాలు తీసుకోవడం బాధాకరమని, ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని ఆయనన్నారు. తనకూ బెదిరింపులు వస్తున్నాయని.. ఎవరూ చలించకండని.. ఎవర్నీ ఎవరూ ఏమీ చేయలేరని.

ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ కాదని అన్నారు. తనను సోషల్ మీడియాలో ఓ మహిళా మూర్తి రకరకాలుగా మాట్లాడందని.. అవి ఆడవాళ్లు మాట్లాడాల్సిన మాటలే కావవి.. ఐతే ఇలా ఎన్నిరకాలుగా ఏం చేసినా ప్రయోజనం లేదని చిటికేసి చెప్పారు రఘురామక కృష్ణంరాజు.

This post was last modified on August 26, 2020 4:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోలిశెట్టి టైమింగ్…రాజుగారి పెళ్లి!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…

10 minutes ago

టాలీవుడ్ ముందు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…

2 hours ago

మార్కెటింగ్ గిమ్మిక్కులు పని చేయలేదా?

జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…

2 hours ago

‘స‌గం’ మీరూ పంచుకోండి.. మోడీకి చంద్ర‌బాబు విన్నపం!

కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీల మ‌ధ్య కొన్ని…

3 hours ago

మళ్లీ ‘సింపతీ’ని నమ్ముకున్న జగన్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…

3 hours ago

బాబుతో పాటు ‘ఈ బ్రాండూ’ పెరుగుతోంది!

సీఎం చంద్ర‌బాబు .. రాజ‌ధాని అమ‌రావ‌తికి బ్రాండ్ అని అంద‌రూ అనుకుంటారు. కానీ, ఆయ‌న అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగ‌ల‌రని…

3 hours ago