స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ కేసుకు ఇతర రాష్ట్రాలతో లింకు ఉందని, అందుకే, పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరముందని ఉండవల్లి పిల్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఉండవల్లిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరిన ఉండవల్లి..మద్యం స్కాంపై సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదని నిలదీశారు. రాజమండ్రి చుట్టూ అక్రమ ఇసుక రీచ్ ల గురించి ఉండవల్లి ఎందుకు ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతల భూకబ్జాలపై మాట్లాడని ఉండవల్లి ఇపుడు మాత్రం సీబీఐ విచారణ కోరుతున్నారని దుయ్యబట్టారు. ఎవరో తయారు చేసిన పిటిషన్ పై ఉండవల్లి సంతకం చేశారా? అని ప్రశ్నించారు. తన పిటిషన్ లో ప్రేమ్ చంద్రా రెడ్డి పేరును ఉండవల్లి ఎందుకు ప్రస్తావించలేదని, నిజానిజాలు తెలిసి కూడా నటించవద్దని ఉండవల్లికి చురకలంటించారు. ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలని ఉండవల్లికి పట్టాభి హితవు పలికారు.
కాగా, హోం శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సీఐడీ, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, గంటా సుబ్బారావు, కె. లక్షీనారాయణ, నిమ్మగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్, డిజైన్‌టెక్ సంస్థ, సంస్థ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, స్కిల్లర్ ఎంటర్‌ప్రైజెస్, సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా 44 మందిని ఉండవల్లి తన పిల్ లో ప్రతివాదులుగా చేర్చారు. కానీ, ఈ జాబితాలో ప్రేమ్ చంద్రారెడ్డి పేరు లేకపోవడంతో పట్టాభి ప్రశ్నించారు. ఉండవల్లి పిల్ పై హైకోర్టు స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on September 22, 2023 11:39 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…