అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి వ్యక్తిగత అనుచరులు.. పనులు చేసే వారికి సంబంధించిన సమాచారం పెద్దగా బయటకు వచ్చేది కాదు. మారిన కాలానికి తగ్గట్లు అందుబాటులోకి వచ్చిన వాట్సాప్.. సోషల్ మీడియా పుణ్యమా అని.. సదరు ప్రముఖులతో కూడిన ఫోటోల్ని ప్రముఖంగా పోస్టు చేసుకోవటం.. వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవటం ఈ మధ్యన పెరుగుతోంది. పేరు ప్రఖ్యాతుల్ని పెంచుకోవటం వరకు ఉత్సాహాన్ని ప్రదర్శించటం బాగానే ఉన్నా.. దాన్ని అడ్డు పెట్టుకొని అక్రమాలకు తెర తీస్తేనే అసలు ఇబ్బంది అంతా.
తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లెటర్ ప్యాడ్.. సంతకాల్ని ఫోర్జరీ చేసిన వైనం షాకింగ్ గా మారింది. ఎందుకంటే.. సదరు వ్యక్తి ఏమీ చిన్నోడు కాదు. మంత్రి గంగుల కమలాకర్ అనుచరుడిగా సుపరిచితుడైన సాయి అలియాస్ చింటూ.
సీఎం కేసీఆర్ తో దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్టు చేయటం.. తన గురించి భారీగా బిల్డప్ లు ఇవ్వటంతో పాటు.. ఉద్యోగాల కోసం ఆశగా తిరిగే యూత్ ను మాయమాటలు చెప్పి.. వారి దగ్గర నుంచి డబ్బులు లాగి మోసం చేసిన ఉదంతాలు బోలెడన్ని అని చెబుతున్నారు.
ఇతగాడిపై గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా.. మంత్రికి అనుచరుడిగా ఉన్న కారణంగా.. పోలీసులు టైం కోసం ఎదురుచూస్తుండేవారని చెబుతారు. తాజాగా సీఎం లెటర్ హెడ్ ను.. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేయటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అతని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తనకు మంత్రి కేటీఆర్ చాలా సన్నిహితమని చెప్పుకొనేవాడు.
తాజాగా అతన్ని టాస్క్ ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకోవటమే కాదు.. అతడి దగ్గర నుంచి నకిలీ లెటర్ హెడ్ ప్యాడ్ లను స్వాధీనం చేసుకున్నారు. అతడి లీలలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నంలో.. మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
This post was last modified on August 23, 2020 11:03 am
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…