Political News

బాబు స్కిల్స్‌ ఇస్తే.. జ‌గ‌న్ లిక్క‌ర్‌, గంజాయి ఇస్తున్నారు: బ్రాహ్మ‌ణి

ఏపీ స‌ర్కారుపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో యువ‌త‌కు గ‌త ముఖ్య‌మంత్రి అయిన చంద్ర‌బాబు నైపుణ్యాల‌ను నేర్పించి ఉద్యోగాలు ఇచ్చార‌ని తెలిపారు. ఇప్పుడున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం యువ‌త‌కు గంజాయి, లిక్క‌ర్ విరివిగా అందిస్తోంద‌ని బ్రాహ్మ‌ణి తీవ్ర‌స్థాయిలోఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు నాయుడు చేసిన త‌ప్పేంట‌ని, ఆయ‌న‌ను తెల్ల‌వార కుండానే ఎందుకు అరెస్టు చేశార‌ని, ఎందుకు జైల్లో పెట్టార‌ని ఆమె నిప్పులు చెరిగారు. ఈ ప్ర‌భుత్వం దేనికీ స‌మాధానం చెప్ప‌డం లేద‌ని విమ‌ర్శించారు.

చంద్రబాబు అరెస్ట్‌, జైలుపాలు చేయ‌డాన్ని నిర‌సిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో రాజమండ్రిలో మహిళలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మహిళలు చేపట్టిన క్యాండిల్ ర్యాలీకి మద్దతుగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. స్థానిక తిలక్‌ రోడ్డులోని సాయి బాబా ఆలయం దగ్గర నుంచి శ్యామలానగర్‌ రామాలయం జంక్షన్‌ వరకూ ఈ క్యాండిల్‌ ర్యాలీ కొనసాగింది.

ఈ సంద‌ర్భంగా నారా బ్రాహ్మ‌ణి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. “చంద్రబాబు లాంటి సీనియర్ నేతను, విజనరీ నేతను అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అన్యాయంగా జైల్లో పెట్టారు. లక్షలాది మందికి స్కిల్స్ ద్వారా ఉద్యోగాలు వచ్చేలా చంద్ర‌బాబు చేశారు. సంక్షేమం చేయడం నేరమా?“ అని బ్రాహ్మ‌ణి ప్ర‌శ్నించారు. అంతేకాదు, ప్ర‌స్తుత ప్రభుత్వం యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉద్యోగాలు ఇచ్చే బ‌దులు.. గంజాయి, లిక్కర్ తప్ప ఏమి ఇస్తోంద‌ని నిల‌దీశారు.

త‌మ‌కు మద్దతు తెలుపుతున్న జాతీయ నాయకులకు, ఐటీ ఉద్యోగులందరికి నారా బ్రాహ్మ‌ణి ధన్యవాదాలు తెలిపారు. లోకేష్ ఒకచోట....మేము ఒకచోట తిరుగుతున్నాం.. నాలాంటి యువతీ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడమే చంద్రబాబు చేసిన తప్పా? లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తారేమో?. రిమాండ్ రిపోర్ట్ చదివితే ఎనిమిదేళ్ళ దేవన్ష్ అయిన అందులో ఏమి లేదని చెప్తాడు. ఇప్పుడు మేము ఒంటరి వాళ్ళం కాదు. మా వెనక టీడీపీ కుటుంబం ఉంది అని నారా బ్రాహ్మ‌ణి వ్యాఖ్యానించారు.

This post was last modified on September 16, 2023 10:00 pm

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

1 hour ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

3 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

3 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

3 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

4 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

5 hours ago