రాబోయో ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గడచిన రెండు ఎన్నికల్లో ముఖ్యంగా 2019లో రిజర్వుడు స్ధానాల్లో తెలుగుదేశంపార్టీకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 36 రిజర్వుడు స్ధానాలున్నాయి. ఇందులో 29 ఎస్సీ, 7 నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వయ్యాయి. వీటిల్లో ప్రస్తుతం తెలుగుదేశంపార్టీ తరపున కేవలం ఒకే ఎంఎల్ఏ ఉన్నారు. మిగిలిన 34 నియోజకవర్గాలూ వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి.
అంటే రాజోలు ఎస్సీ నియోజకవర్గంలో జనసేన గెలిచినా ఆ ఎంఎల్ఏ వైసీపీతోనే ఉంటున్నారు. కాబట్టే 34 నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయని చెప్పింది. ఇపుడు చంద్రబాబు సమస్య ఏమిటంటే ఈ నియోజకవర్గాల్లో మ్యాగ్జిమమ్ ఎన్ని గెలుచుకోగలము అన్నదే. కనీసం సగం నియోజకవర్గాల్లో అయినా గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. టార్గెట్ రీచవ్వాలంటే అందుకు ఎంపికచేయబోయే అభ్యర్ధులు ఫ్రెష్ గా ఉండాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం.
అవకాశం ఉన్నంతలో పై 36 నియోజకవర్గాల్లో కొత్త ముఖాలను పోటీకి దింపితే ఎలాగుంటుందని చంద్రబాబు సీరియస్ గా ఆలోచిస్తున్నారట. తప్పదు అనుకుంటే మాజీమంత్రులు, మాజీ ఎంఎల్ఏలుగా చేసిన కొందరికి టికెట్ ఇవ్వకతప్పదని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే అన్నీ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను వెతికే పనిలో ఉన్నారట. ఆర్ధికంగా గట్టిగా ఉన్నదెవరు, విద్యావంతులు ఎవరు, పార్టీలో బాగా యాక్టివ్ గా ఉన్నదెవరు అనే విషయాలపై సమాచారం తెప్పించుకుంటున్నారు.
ఒకవేళ పార్టీలో అంత యాక్టివ్ గా లేకపోయినా వివిధ రంగాల్లో పాపులరైన వాళ్ళుంటా వాళ్ళ వివరాలను కూడా తెప్పించుకుంటున్నారట. అంటే బ్యాంకు అధికారులు, టీచర్లు, లెక్చిరర్లు, వ్యాపారాల్లో స్ధిరపడిన వాళ్ళ, స్వచ్చంధ సంస్ధలు నడుపుతున్నవారి వివరాలను సేకరిస్తున్నారట. ఇలాంటి వాళ్ళయితే ఎస్టీ జనాలతో బాగా కాంటాక్టులో ఉంటారని చంద్రబాబు అనుకుంటున్నారు. అలాగే ఎస్సీ నియోజవర్గాల్లో కూడా వీలైనన్ని కొత్తముఖాలను పోటీలోకి దింపితే లాభం ఉంటుందని ఫీడ్ బ్యాక్ వచ్చిందట. అందుకనే ఎక్కడ వీలైతే అక్కడ బలమైన కొత్త ముఖాలను రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధులుగా దింపాలని చంద్రబాబు డిసైడ్ అయ్యింది.
This post was last modified on September 6, 2023 10:24 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…