తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలోనే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సాగబోతున్నారా? కేసీఆర్ లాగే రెండు చోట్ల పోటీ చేసేందుకు బాబు ఆలోచిస్తున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో బాబు రెండు స్థానాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం టీడీపీకి అత్యవసరం. అందుకోసం చంద్రబాబు ప్రణాళికలు, కసరత్తుల్లో మునిగిపోయారు. పార్టీని తిరిగి అధికారంలోకి తేవడం కోసం కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో తన సొంత నియోజకవర్గం కుప్పంపైనా ఫోకస్ పెట్టారు. మరోవైపు కుప్పంలో చంద్రబాబును ఓడించి టీడీపీని చావుదెబ్బ కొట్టాలనే పట్టుదలతో అధికార వైసీపీ ఉంది. ఆ బాధ్యతలను ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ అప్పగించారు. చిత్తూరు జిల్లా ఇంచార్జీగా పెద్దిరెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇక కుప్పం ఇంచార్జీగా భరత్ కూడా జోరుమీదున్నారు. స్థానిక ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ హవా చూపిన సంగతి తెలిసిందే.
మరోవైపు కుప్పంలో ఓట్లను భారీ సంఖ్యలో పీకేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎక్కడో స్థిరపడి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే జనాలను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఓట్లను తొలగిస్తున్న నియోజకవర్గాల్లో కుప్పం కూడా ఒకటి. ఇవన్నీ టీడీపీకి అనుకూలంగా ఉండే ఓట్లేననే ఆరోపణలున్నాయి. అందుకే టీడీపీకి పడే ఓట్లను తొలగిస్తుండడంతో బాబు ఆలోచనలో పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా వచ్చే ఎన్నికల్లో కుప్పంతో పాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని భావిస్తున్నారని సమాచారం.
This post was last modified on August 27, 2023 10:43 am
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…