ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ప్రజా యుద్ధనౌక(పీపుల్స్ వార్ షిప్) గద్దర్‌పై తన హయాంలో జరిగిన కాల్పులకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, గద్దర్‌పై కాల్పులు జరపమని నేను ఎవరినీ ఆదేశించలేదని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయు డు అన్నారు. అయితే.. ఓ వర్గం టీవీ, మీడియాలు తనను ఈ విషయంలో ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తు న్నాయని.. వాస్తవాలు ఏమిటో 1997లో విధుల్లో ఉన్న పోలీసులకు కూడా తెలుసునని వ్యాఖ్యానించారు.
77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన అల్వాల్‌లోని గద్దర్‌నివాసానికి వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యు లను ఓదార్చారు. పార్టీ పరంగానే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా ఈ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుం దన్నారు. 1997లో గద్దర్ పై కాల్పులు జరిగిన ఘటనపై చంద్రబాబు ఈ సందర్భంగా స్పందించారు.
నాటి కాల్పుల ఘటనకు సంబంధించి ఇటీవల కొందరు తనపై తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల ఘటన తర్వాత గద్దర్.. తనతో అనేక సార్లు మాట్లాడారని చెప్పారు. తమ మధ్య స్నేహం అలానే కొనసాగిందన్నారు. హైదరాబాద్‌లో ఉంటే.. గద్దర్ తరచుగా వచ్చి కలిసి మాట్లాడేవారని తెలిపారు. గద్దర్‌కు తనకు అనేక విషయాల్లో పోలికలుఉ ఉన్నాయని చంద్రబాబు చెప్పారు.
తన లక్ష్యం.. గద్దర్ లక్ష్యం ఒక్కటేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదల హక్కుల పరిరక్షణకోసమే అటు గద్దర్, ఇటు తాను జీవితాలను అంకితం చేశామన్నారు. ఇక, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీచేస్తుందన్న చంద్రబాబు.. హైదరాబాద్ అభివృద్ధికి కారణం ఎవరో అందరికీ తెలుసన్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఫలాలు తెలంగాణలో ప్రతి ఒక్కరకీ అందుతున్నాయని చంద్రబాబు చెప్పారు. కాబట్టి.. ఇక్కడ ఓట్లు అడిగే హక్కు తమకు ఖచ్చితంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
This post was last modified on August 15, 2023 3:57 pm
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…