భూమా బ్రహ్మానందరెడ్డి-భూమా జగత్‌విఖ్యాతరెడ్డి-భూమా మౌనికారెడ్డి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో విఖ్యాత్‌రెడ్డి-మౌనిక అక్కాతమ్ముళ్లు. బ్రహ్మానందరెడ్డి.. ఈ కుటుంబం మలిచిన రాజకీయ నాయకుడు. 2017లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో హఠాత్తుగా రాజకీయ తెరమీదకు వచ్చిన నాయకుడు బ్రహ్మానందరెడ్డి. అయితే.. ఆయనేమీ.. టెంపరరీ కోసం రాలేదని.. స్వయంగా చెప్పారు. 2019లో టికెట్ వివాదం ఏర్పడినప్పుడు.. స్వతంత్రంగా పోటీ చేస్తానని కూడా హెచ్చరికలు జారీ చేశారు.
పాలవ్యాపారి కావడంతోపాటు.. ఆర్థికంగా బలంగా ఉన్న బ్రహ్మానందరెడ్డి.. ఇప్పుడు మరోసారి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక, విఖ్యాత్‌రెడ్డి విషయానికి వస్తే.. తానే నిజమైన వారసుడినని.. భూమా నాగిరెడ్డి పేరు నిలబెట్టేందుకు తానే నడుంకడతానని.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు చారిత్రక అవసర మని అంటున్నారు. అప్పట్లో అంటే 2017లో అవసరం కొద్దీ బ్రహ్మానందరెడ్డిని తీసుకున్నామని కూడా ఆయన చెబుతున్నారు.
ఇక, వీరిద్దరూ నంద్యాల టికెట్ కోసం ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు భూమా మౌనిక కూడా చంద్రబాబును కలుసుకోవడం.. వచ్చే ఎన్నికల్లో పోటీ అంటూ.. ఆయనతో చర్చించడంవరకు రాజకీయం సాగిందని అంటున్నారు. దీంతో ఆమె కూడా నంద్యాల టికెట్ కోసం ఎదురు చూసే అవకాశం లేకపోలేదు. అంటే.. మొత్తంగా ఒక్క సీటు కోసం.. భూమా కుటుంబం రాజకీయంగా ఒకరితో ఒకరు తలపడే అవకాశం ఉంది.
పోనీ.. తమ్ముడు కోసమని మౌనిక తప్పుకొన్నా.. భూమా బ్రహ్మానందరెడ్డి మాత్రం తప్పుకొనే అవకాశం లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో చంద్రబాబు పిలిచి చెప్పినా.. వెనక్కి తగ్గకుండా.. ఒంటరి పోరుకు రెడీ అయ్యారు. ఇప్పుడు కూడా అదే పంథాలో సాగాలనిదాదాపు నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఇదే జరిగితే ఆయన గెలుపు ఓటములు విషయాన్ని పక్కన పెట్టి.. ఓట్లు చీలిపోవడంలో ప్రధాన పాత్రధారి అవుతాడు. దీంతో ఇది పరోక్షంగా భూమా కుటుంబానికి ఇబ్బందేనేని అంటున్నారు. ఈ క్రమంలో ఈ సమస్యను ఇప్పుడే పరిష్కరించుకోవడం మంచిదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 7, 2023 11:05 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…