టార్గెట్ రాయలసీమ.. నినాదంతో టీడీపీ అధినేత చంద్రబాబు బలమైన వ్యూహాన్ని రెడీ చేసుకున్నారనే మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి అధికారం దక్కించుకోవడమే ధ్యేయంగా.. పార్టీ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికి ఉత్తరాంధ్ర, కోస్తాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు.. ఇక, ఎన్నికలకు ముందు కీలకమైన సీమపైతన వ్యూహాలను రెడీ చేసుకున్నారని అంటున్నారు.
ఆగస్టు 1 నుంచి నాలుగు రోజుల పాటు చంద్రబాబు సీమలో పర్యటించనున్నారు. ఇక్కడ కీలకమైన సమస్యగా ఉన్న సాగునీటి అంశాన్ని ప్రధానంగా లేవనెత్తాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం రెడీ చేసుకున్నారు. రైతులతోనూ మమేకం అవుతున్నారు. ఉమ్మడి అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రధానంగా సాగనున్న చంద్రబాబు పర్యటనలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొనేలా చూస్తున్నారు.
వైసీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అస్త్రాలుగా చేసుకుని చంద్రబాబు ఇక్కడ రైతుల ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకొనే ప్రయత్నంలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు సీమ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. అదేసమయంలో కడప వంటి ప్రాంతా లను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పింది. అయితే.. ఈ హామీలు అలానే ఉండిపోయాయి. ఇప్పుడు వాటినే టార్గెట్ చేసుకుని చంద్రబాబు పొలిటికల్ యాత్రకు రెడీ అవుతున్నారు.
నిజానికి పులివెందులకు అందుతున్న నీరు.. గతంలో చంద్రబాబు నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టుతోనే సాధ్యమైందని అంటారు. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా పదే పదే చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించనున్నారు. అదేసమయంలో పార్టీలో అంతర్గత విభేదాలను కూడా తగ్గించేందుకు.. చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నారు. మొత్తంగా.. సీమ పర్యటనపై చాలానే ఆశలు పెట్టుకున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
This post was last modified on July 31, 2023 2:17 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…