వంగవీటి రంగా.. విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన దివంగత నాయకుడు. బెజవాడ రాజకీయాల్లో ఆయన ఆధిపత్యం గొప్పగా సాగింది. ఈ సారి ఏపీ ఎన్నికల్లో ఆయన పేరు నిలబెట్టాలనే లక్ష్యంతో.. వంగవీటి రంగా కుమార్తె ఆశాలత రాజకీయం రంగప్రవేశం చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తండ్రి వారసత్వాన్నిపుణికిపుచ్చుకుని రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ఆమె రానున్నారని, విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయనున్నారని స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికల్లో రంగా కుటుంబానికి రాజకీయంగా మంచి పట్టున్న విజయవాడ సెంట్రల్ నుంచి ఆశాలతను పోటీ చేయించే అవకాశాలున్నాయి. ఇందుకు ఆమె మేనమామ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వంగవీటి రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారి ఎమ్మెల్యే అయ్యారు. రంగా కుమారుడు రాధా కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ వీళ్లు పెద్దగా హవా కొనసాగించలేకపోతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం రాధా రాజకీయాల్లో కొనసాగుతున్నా బయట ఎక్కువగా కనిపించడం లేదు.
రంగా వారసత్వాన్ని ఉపయోగించుకుని విజయవాడతో పాటు గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం ఆశాలతను చేర్చుకోవడానికి వివిధ పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రంగా అభిమానుల బలమే ఆశాలతను గెలిపిస్తుందని అంటున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రంగా వారసురాలిగా ఆశాలత రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఖాయమేననిపిస్తోంది. మరి ఆమె ఏ పార్టీలో చేరతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
This post was last modified on July 26, 2023 7:30 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…