బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యూహాత్మకంగా వెళుతున్నట్లున్నారు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. అన్నీ సవ్యంగా కుదిరితే డిసెంబర్లోనే ఎన్నికలు జరగాలి. బండి సంజయ్ నుండి కిషన్ బాధ్యతలు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కిషన్ ప్రెసిడెంట్ గా నియమితులైనప్పటినుండి చాలామంది బండితో పోలికి చూసి చప్పరించేస్తున్నారు. దాంతో కిషన్ కు బాగా మండినట్లుంది. అందుకనే బాధ్యతలు తీసుకోగానే గోల మొదలుపెట్టేశారు.
బాటసింగారంలో కేసీయార్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూంల ఇళ్ళని పరిశీలించే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. కిషన్ వెంట సీనియర్ నేతలు, కార్యకర్తలు చాలామందే బయలుదేరారు. అయితే అందరినీ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కిషన్ రోడ్డుమీద బైఠాయించారు. ఒకవైపు భారీ వర్షం మరోవైపు పోలీసులు అడ్డగింత కారణంగా కిషన్ రోడ్డుమీద కూర్చునేశారు. ఫలితంగా ఏమైందంటే రెండువైపులా ట్రాఫిక్ భారీగా జామ్ అయిపోయింది. కిషన్ బృందం డబుల్ బెడ్ రూం ఇళ్ళ పరిశీలనా రాజకీయమే.
కిషన్ ను అడ్డుకోవటమూ కేసీయార్ ప్రభుత్వం రాజకీయమే. ఎందుకంటే కేంద్రమంత్రి హోదాలో కిషన్ రెడ్డి డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణాలను పరిశీలించాలంటే ఉన్నతాధికారులను తీసుకెళ్ళచ్చు. అలాకాకుండా అంతా పార్టీ నేతలు, కార్యకర్తలనే తీసుకెళ్ళాలని అనుకున్నారు. అంటే డబుల్ బెడ్ రూం ఇళ్ళ పరిశీలన పేరుతో ఫక్తు రాజకీయం చేయటమే చేయటమే కిషన్ ప్లాన్ గా కనబడుతోంది. ఇదే సమయంలో వీళ్ళని అడ్డుకోవటం ద్వారా పోలీసులను ముందుపెట్టి అంతే రాజకీయానికి కేసీయార్ ప్రభుత్వం కూడా తెరలేపింది.
కిషన్ ప్లాన్ చూస్తుంటే బండి మరో నాలుగైదు మాసాలు ఇలాంటి గొడవలే చేయాలని అనుకుంటున్నట్లు అనుమానంగా ఉంది. కిషన్ ముందున్న సమస్య ఏమిటంటే బండికన్నా తాను ఎందులోను తీసిపోనని నిరూపించుకోవటమే. అందులో భాగంగానే ముందుగా డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణాల పరిశీలన అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం ఎందుకు వివాదాస్పదమవుతుందంటే ఈ నిర్మాణాల్లో ఇటు కేంద్ర అటు రాష్ట్రప్రభుత్వ నిధులన్నాయి కాబట్టే. అందుకనే ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ వివాదంలో నడుస్తునే ఉంటుంది. మరి కిషన్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటో చూడాలి.
This post was last modified on July 21, 2023 10:53 am
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…