పదవిలో ఉన్నపుడు అవకాశం ఉన్నంతవరకు అధికారాన్ని వాడేందుకు చాలామంది నేతలు మొగ్గుచూపుతారు. పవర్ లో ఉన్నపుడు చలాయింపు ధోరణి….ఏం చేసినా అడిగేవారుండరన్న ధీమా చాలామంది రాజకీయ నేతల్లో ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. అయితే, ఆ విషయాలను పెద్దగా ఎవరూ పట్టించుకోరు కాబట్టి ప్రజా ప్రతినిధులు…ఈ దుబారా ఖర్చు గురించి లెక్కలు చెప్పాల్సిన అవసరం దాదాపుగా రాదు. అయితే, కొన్ని సార్లు పవర్ లో ఉన్నపుడు చేసిన దుబారా ఖర్చు..కొందరు నేతలను వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా, ఏపీ మాజీ సీఎం చంద్రబాబును కూడా ఆ తరహాలోని ఓ దుబారా ఖర్చు వెంటాడుతోంది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్ష
తాలూకు ఖర్చు ఇప్పటికీ నీడలా వెంటాడుతోంది. ఆ దీక్షకు ఖర్చు చేసిన నిధులపై తాజాగా లోకాయుక్తలో ఏవీ రమణ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఈ దీక్షకు రూ.7.5 కోట్ల ప్రజాధనం దుర్వినయోగం చేశారని ఫిర్యాదులో రమణ ఆరోపించారు.
2019లో చంద్రబాబు సీఎం హోదాలో ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష
చేశారు. ఈ దీక్ష కోసం ఏపీ నుంచి ఢిల్లీకి ప్రత్యేకంగా రైళ్లను నడిపారు. దీంతోపాటు, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ జతకూర్చే ప్రయత్నంలో ఆయా పార్టీల నేతల్ని దీక్షకు ఆహ్వానించారు. బీజేపీ, ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. అయితే, ప్రజాధనాన్ని రాజకీయాల కోసం దుర్వినియోగం చేయడంపై ఆనాడే బీజేపీ,వైసీపీ ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే ఆ అంశంపై జులై 4న లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా తాజాగా ఆగస్టు 7న కేసు నమోదైంది. ఈ కేసు విచారణ అక్టోబరు 1, 2020 నాటికి వాయిదా పడింది. దీంతోపాటుట, టీడీపీ హయాంలో అవినీతిపై విచారణ జరపాలని కూడా లోకాయుక్తలో ఫిర్యాదు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదులపై లోకాయుక్త ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…
హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం…