Political News

క్ష‌మాప‌ణ‌లతో నిరీక్ష‌ణ ఫ‌లించేనా పవ‌న‌న్నా?!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా చేస్తున్న వారాహి విజ‌య‌యాత్ర ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని త‌ణుకులో సాగింది ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ కీల‌క నాయ‌కుడు.. విడివాడ రామ‌చంద్ర‌రావుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అది కూడా బ‌హిరంగంగానే కావ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్యపోయారు. అయితే.. దీనికి ప‌వనే వివ‌ర‌ణ ఇచ్చారు. తాను క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అనుకున్నాన‌ని. అదికూడాబ‌హిరంగంగానే చెప్పాల‌ని నిర్ణ‌యించుకుని చెబుతున్నాన‌ని వ్యాఖ్యానించారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా త‌ణుకులో వారాహి యాత్ర బ‌హిరంగ స‌భ ప్రారంభం కాగానే విడివాడ రామ‌చంద్ర‌రావుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

అస‌లు విష‌యం ఏంటంటే.. జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా విడివాడ రామ‌చంద్ర‌రావు.. జ‌న‌సేన త‌ర‌ఫున ప‌నిచేస్తున్నా రు. అంతేకాదు.. పార్టీలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ప‌వ‌న్ వ‌స్తున్నారా..రావ‌డం లేదా.. అనే విష‌యంతో సంబంధం లేకుండా.. త‌న ప‌నితాను చేసుకునిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే 2019ఎన్నిక‌ల్లో త‌ణుకు అసెంబ్లీ టికెట్‌ను విడివాడ ఆశించారు. కానీ, ప‌వ‌న్ ప‌ట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలోనే పసుపులేటి వెంక‌ట రామారావుకు టికెట్ ఇచ్చారు. అయితే.. ఆయ‌న మూడో స్తానానికి ప‌డిపోయారు. చిత్రం ఏంటంటే.. త‌న‌కుటికెట్ ఇవ్వ‌క‌పోయినా ప‌సుపులేటి ప్ర‌చారానికి విడివాడ ఎంతో ప‌నిచేశారు.

క‌ట్ చేస్తే..ఎన్నిక‌ల త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిణామాతో ప‌సుపులేటి జ‌న‌సేన జెండో వ‌దిలేశారు. కానీ, విడివాడ రామ‌చంద్ర రావుమాత్రం పార్టీలోనే కొన‌సాగుతున్నారు. ఎక్క‌డా కూడా అసంతృప్తి లేదు. పార్టీ అంటే.. ఇప్ప‌టికీ ప్రాణం పెడుతున్నారు. ఈ విష‌యం మొత్తానికి జ‌న‌సేనానికి చేరింది. ఈ క్ర‌మంలోనే తాజాగా వారాహి యాత్ర‌కు ఆహ్వానించి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఇప్పుడు ప‌వ‌న్ సారీ చెప్పారు. అంతేకాదు.. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ తీసుకుని పార్టీ నుంచి జంప్ అయిపోయిన ప‌సుపులేటిపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఓకే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, ఇప్ప‌టి కీ కూడా.. ప‌వ‌న్ విడివాడ‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు. త‌ణుకులో నీకు టికెట్ ఇస్తాను. నువ్వు బాగా ప‌నిచేస్తున్నావ్‌! అని ప‌వ‌న్ అని ఉంటే.. ఆ ఊపు మ‌రింత ఎక్కువ‌గా ఉండేద‌ని పార్టీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కానీ ప‌వ‌న్ క్ష‌మాప‌ణ‌లు కోరారు.. కానీ.. ఎక్క‌డా టికెట్ ప్ర‌స్తావ‌న మాత్రం తీసుకురాలేదు. దీనిపైనే పార్టీలో అంత‌ర్గ‌త విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. పార్టీ కోసం ప‌నిచేస్తున్న‌వారిని ప్రోత్స‌హిస్తే.. పార్టీకే మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

This post was last modified on July 15, 2023 11:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

2 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

3 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

3 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

4 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

5 hours ago