రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. వాస్తవానికి సార్వత్రిక సమరానికి ఇంకా 8 నుంచి 9 నెలల గడు వుంది. అయితే.. అప్పుడే ఎన్నికలు జరుగుతాయా? లేక.. మరో నాలుగు మాసాల్లో తెలంగాణతోపాటే ఎన్ని కలు వస్తాయా? అనేది ఆసక్తిగా మారింది. దీంతో రాజకీయంగా ఏపీలో కొందరు నాయకులు పావులు కదపా లని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకునేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
అంటే.. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి గెలుపు గుర్రం ఎక్కుతుందని భావించే పార్టీలవైపు కీలక మాజీ నేతలు.. మాజీ మంత్రులు.. ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు.. సివిల్ సర్వెంటు.. ఉన్నతాధి కారులు అందరూ చూస్తున్నారు. దీంతో ఇటు టీడీపీ, అటు వైసీపీలోకి చేరేవారి సంఖ్య పదుల్లోనే ఉందని అంచనా వస్తోంది. ఇలాంటివారిలో కొందరు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా ఉన్నారు.
ఓడిన తర్వాత.. పార్టీలకు దూరంగా ఉన్నవారు కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు వీరంతా ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదని భావిస్తున్నారు. అంటే.. పొత్తులు ఉన్నా.. లేకున్నా.. కీలకమైన మూడు పార్టీలే బలంగా వచ్చే ఎన్నికలను శాసిస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒంటరి పోరు చేసి.. చేతిలో ఉన్న రూపాయిని పాడుచేసుకోవడం కంటే.. ఏదో ఒక పార్టీలో చేరడం మంచిదనే భావనతో ఉన్నారు. దీంతో వీరు పార్టీలపై అంచనాలకు వచ్చారు.
అధికారంలోకి వచ్చే పార్టీ.. గ్యారెంటీగా అధికారం దక్కించుకునే పార్టీ, ఫిఫ్టీ-ఫిఫ్టీగా అంచనాలు ఉన్నపార్టీ అనే మూడు కేటగిరీలుగా నాయకులు, బ్యూరోక్రాట్లు ఓ అంచనా వేశారు. ఇలా ఇక, ఒక నిర్ణయానికి వచ్చిన నాయకులు, సీనియర్ రిటైర్డ్ అధికారులు కోస్తా, సీమ, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లోనూ కలిపి సుమారు 20 -30 మంది ఉంటారని లెక్క. వీరంతా ఆయా పార్టీల్లో చేరేందుకు సంసిద్ధంగానే ఉన్నారు. అయితే.. సర్వేలపైనే వారి గురి ఒకింత అటు ఇటుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా.. వచ్చే రెండు మూడు మాసాల్లో మాత్రం ఈ చేరికలు ఖాయమనే అంచనాలు వస్తున్నాయి.
This post was last modified on July 14, 2023 7:21 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…