Political News

సీఎం సీటుకే విలువ‌.. జ‌గ‌న్‌కు కాదు: ప‌వ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి రెండో ద‌శ యాత్ర‌ను ప్రారంభించారు. తొలిరోజు ఆదివారం ఏలూరులో యాత్ర నిర్వ‌హించిన ఆయ‌న ఈ సంద‌ర్భంగా బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. తాను ముఖ్య‌మంత్రి సీటుకు విలువ ఇస్తున్నాన‌ని, జ‌గ‌న్‌కు మాత్రం కాద‌ని వ్యాఖ్యానించారు.

“సీఎం పీఠానికి విలువ ఇస్తాను.. జగన్‌కు కాదు. వైసీపీ నేత‌ల‌ రాజకీయ విలువలు మాట్లాడుతున్నాను. నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. ఎంత దిగజారుడుతనంతో మాట్లాడుతున్నారో అంద‌రూ చూస్తున్నారు. వింటున్నారు. సీఎంను ఇక నుంచి ఏకవచనంతోనే పిలుస్తాను. వైసీపీ నాయకులను నువ్వు అని ఏకవచనంతో మాట్లాడతాను. సీఎం పదవికి జగన్ అనర్హుడు. వైసీపీ ఈ రాష్ట్రానికి సరైనది కాదు” అని నిప్పులు చెరిగారు.

ఏలూరులో వరదల వస్తే ఎందుకు మునిగిపోతుంది.. రక్షణ గోడలు ఏమయ్యాయని ప‌వ‌న్ ప్రశ్నించారు. జగన్‌కు జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు బానిసలు కార‌న్నారు. సీఎం పదవికి బానిసలం కాదన్నారు. సీఎం కూడా మనలో ఒకడు అంతే అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. “మన శ్రమశక్తితో కట్టే పన్నులకు, ఖజానాకు సీఎం జవాబుదారీ. మన రాష్ట్ర ఖజానా రూ. 10 లక్షల కోట్లు. వాటిని ఎలా ఖర్చుపెట్టారో మనకు చెప్పాలి” అని ప‌వ‌న్ నిల‌దీశారు.

జగన్ రూ. లక్షా 18 వేల కోట్లు అప్పు తీసుకుని ఎందుకు ప్రజలకు లెక్క చెప్పలేదని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. “కాగ్ నిన్ను ఎందుకు ప్రశ్నించింది. దానికి నువ్వు, నీ మంత్రులు సమాధానం చెప్పాలి. రూ.22 వేల కోట్లు లిక్కర్ బాండ్లపై అప్పు తీసుకుని, ఆ డబ్బు ఏం చేశారు. రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డబ్బు ఏం చేశావో నువ్వు, నీ మంత్రివర్గం రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు” అని పవన్ డిమాండ్ చేశారు. పోరాటం చేస్తే విజయం వస్తుందో లేదో తెలీదని, అయినా పోరాటం చేస్తున్నానని స్పష్టం చేశారు.

This post was last modified on July 10, 2023 8:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

43 minutes ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

3 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

3 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

4 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

4 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

6 hours ago