విన్నంతనే నమ్మలేం. కానీ.. ఇది నిజంగా నిజం. కరోనా పాజిటివ్ కావటంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన ఒక వ్యాపారవేత్త.. ఎట్టకేలకు కోలుకోవటం బాగానే ఉన్నా.. అతగాడి చేతికి ఇచ్చిన బిల్లును చూసి గుండె ఆగినంత పనైందట. దాంతో ఆ వ్యాపారస్తుడు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. వైరల్ గా మారిన ఈ ఉదంతం గురించి చెబితే..
గుజరాత్ లోని సూరత్ పట్టణానికి చెందిన ఖాదర్ షేక్ అనే బడా వ్యాపారికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో.. వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. దాదాపు ఇరవై రోజుల పాటు ఆసుపత్రిలోచికిత్స పొందిన ఆయన.. చివరకు డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. సదరుఆసుపత్రి వారు వేసిన బిల్లు చూసి అవాక్కు అయ్యాడు.
తనలాంటి సంపన్నుడైతే వైద్యం చేసుకోవటం ఓకే. మరి..ఇదే జబ్బు పేదలకు వస్తే పరిస్థితి ఏమిటన్న ఆలోచన చేసిన తర్వాత ఆయన ఆస్సలు ఆగలేదు. ఆసుపత్రి నుంచి వచ్చిన ఆయన.. తన ఆఫీసు కార్యాలయాన్ని ఏకంగా కొవిడ్ ఆసుపత్రిగా మార్చేయాలని డిసైడ్ అయ్యారు. వెంటనే.. పరిష్మన్ల కోసం ప్రయత్నించి.. తాను ఆసుపత్రి పెట్టాలనుకున్న కారణాన్ని చెప్పుకొచ్చారు.
దీంతో.. యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చేశారు. దీంతో.. అప్పటివరకూ తన ఆఫీసుగా ఉన్న కార్యాలయాన్ని ఏకంగా ఆసుపత్రిగా మార్చేశాడు. మొత్తం 85 బెడ్లతో ఆసుపత్రిగా మార్చేశాడు. రోగులకు అవసరమై సకల సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చేశాడు. ఇతగాడి ప్రయత్నం చూసిన గుజరాత్ ప్రభుత్వం.. వైద్య సిబ్బంది.. యంత్రాలు.. మెడిసిన్లను పంపింది.
ఇక.. బెడ్లను.. కరెంటు బిల్లుల్ని తాను భరిస్తానని ఖాదర్ డిసైడ్ అయ్యాడు. మొత్తంగా ఆసుపత్రిని సిద్ధం చేశారు. తన ఆసుపత్రిలో కులం.. మతంతో సంబంధం లేకుండా ఎవరినైనా చేర్చుకుంటామని సెలవిస్తున్నారు. ఇలాంటి మనసున్న మారాజులు.. వెంటనే స్పందించే ప్రభుత్వాలుఊరికొకటి ఉంటే.. కరోనా కారణంగా ఆగమాగం అయ్యే పరిస్థితి ఉండదేమో?
This post was last modified on August 5, 2020 2:31 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…