బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే పేరు ఉన్నట్లుండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమెపై ఓ సంచలన ఆరోపణ రావడమే ఇందుక్కారణం. ఈ ఏడాది జనవరిలో అల్లర్లతో అట్టుడుకుతున్న ఢిల్లీ జవహర్ లాల్ యూనివర్శిటీలోకి దీపిక వెళ్లడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. యూనివర్శిటీలో చేపట్టిన కొన్ని సంస్కరణలకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు హింసాత్మక ఆందోళనలకు దిగడం, పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించి విద్యార్థులను చితకబాదడం.. ఈ నేపథ్యంలో దీపిక ధైర్యంగా జేఎన్యూకు వెళ్లి వారికి సంఘీభావం పలకడం చర్చనీయాంశమైంది. తన కొత్త చిత్రం ‘చపాక్’ విడుదలకు ముందు పబ్లిసిటీ కోసమే దీపిక జేఎన్‌యూకు వెళ్లి హడావుడి చేసిందని కొందరు విమర్శించినప్పటికీ.. చాలామంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు.
ఐతే ఇప్పుడా వ్యవహారం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. జాతీయ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ అధికారి ఎన్కే సూద్ దీపిక మీద సంచలన ఆరోపణ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన బడా పారిశ్రామిక వేత్త అనీల్ ముసారత్ కోరిక మేరకే దీపిక జేఎన్‌యూకు వెళ్లిందని.. ఇందుకు గాను ఆమెకు రూ.5 కోట్లు ముట్టాయని ఆరోపించాడు. ఎవరో ఆషామాషీ వ్యక్తి ఈ ఆరోపణలు చేస్తే పట్టించుకోవాల్సిన పని లేదు కానీ.. ‘రా’ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేసిన మాజీ అధికారి యూట్యూబ్ వీడియో ద్వారా ఇలా ఆరోపించడంతో దీనిపై చర్చ నడుస్తోంది. జేఎన్‌యూలో లెఫ్ట్ భావజాలంతో ఉండే చాలామంది.. దేశ వ్యతిరేక నినాదాలు చేయడం, వివిధ అంశాల్లో పాకిస్థాన్‌ను సమర్థించడం చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇక్కడి వారికి పాక్ నుంచి ఆర్థిక సహకారం అందుతూ ఉంటుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీపిక మీద వచ్చిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
This post was last modified on August 1, 2020 5:53 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…