లాక్ డౌన్ పెట్టిన మొదట్లో వలస కార్మికుల అవస్థలు చూసి అందరూ కన్నీళ్లు పెట్టిన వాళ్లే. కానీ అందరూ ఎక్కడికక్కడ లాక్ అయిపోయి ఉండటంతో వాళ్లకు మనం ఏం చేయలేం అని ఊరుకున్నారు. ఏం చేసినా ప్రభుత్వాలే చేయాలనుకున్నారు. కానీ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మాత్రం అలా ఆలోచించలేదు. వలస కార్మికులను ఆదుకుంటా.. వాళ్లను గమ్య స్థానాలకు చేరుస్తా అంటూ ముందుకొచ్చాడు. అయితే ఒక నటుడు ఇలా ఎంతమందికి సాయం చేస్తాడులే అని లైట్ తీసుకున్నారు జనాలు. కానీ అతను దీన్ని ఒక యజ్ఞంలాగే చేశాడు. ఎంతకీ ఆపకుండా వందలు, వేల మందిని తన సొంత ఖర్చుతో, అన్ని అనుమతులూ తీసుకుని స్వస్థలాలకు చేర్చాడు. ఇలా 20 వేల మంది దాకా సోనూ సాయంతో ఇళ్లకు చేరారు. ఐతే తన సేవను అంతటితో ఆపకుండా.. ఇప్పటికీ రకరకాల మార్గాల్లో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు సోనూ.
ఇలా ఇంకెంత సేవ చేస్తాడని ఆశ్చర్యపోతుంటే.. అతను గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా ఓ సంచలన ప్రకటనతో ముందుకొచ్చాడు. ఇప్పటికే వలస కార్మికులకు ఉద్యోగాలు కల్పించడం కోసం నడుం బిగించిన సోనూ.. నిరుద్యోగులకు మూడు లక్షల ఉద్యోగాల కల్పనే తన లక్ష్యమని వెల్లడించారు. సోనూ ఇప్పటికే వలస కార్మికులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ‘ప్రవాసీ రోజ్‌గార్’ పేరుతో జాబ్ పోర్టల్‌ను ప్రారంభించాడు. ఈ పోర్టల్ ద్వారా మూడు లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోనూ తాజాగా వెల్లడించాడు.‘‘నా పుట్టినరోజు సందర్భంగా చిరు ప్రయత్నం చేస్తున్నాను. ప్రవాసీరోజ్‌గార్.కామ్ ద్వారా మూడు లక్షల ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించాం. మంచి వేతనం, పీఎఫ్, ఈఎస్ఐతోపాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయి’’ అని సోనూ సూద్ ట్విటర్‌లో వెల్లడించాడు. ఉద్యోగుల అవసరం ఉన్న సంస్థలతో సోనూ టీం ఒప్పందం చేసుకుని.. మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వలస కార్మికులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుందన్నమాట. ఇందులో సోనూకు లాభం లేదు. అలాగని అతను సొంతంగా ఉద్యోగాలు కల్పించాల్సిన పని లేదు. కానీ ప్రయోజనం మాత్రం నెరవేరుతుంది. అందరికీ మంచి జరుగుతుంది.
This post was last modified on %s = human-readable time difference 1:55 am
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…