ఏపీ సీఎం హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా కొత్త నిర్ణయాలను అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో కోర్టులు, రాజకీయ పార్టీలు, సామాన్య జనం ఏమనుకుంటున్నా కూడా పెద్దగా పట్టించుకోనట్టు కనిపిస్తున్న జగన్… తాను అనుకుంటున్న నిర్ణయాలను అమలు చేసి తీరేందుకే సిద్ధ పడుతున్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పటికే పలుమార్లు కోర్టుల నుంచి మొట్టికాయలు తిన్న జగన్… తాజాగా కేంద్రం నుంచి కూడా పెద్ద ఎదురు దెబ్బ తిన్నారనే చెప్పాలి. ప్రభుత్వ విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతానని, ఎవరు అడ్డుకున్నా.. ముందుకే సాగుతామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం మాతృభాషలోనే జరగాలని తాజాగా కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ప్రాథమికోన్నత విద్యను కూడా మాతృభాషలోనే కొనసాగిస్తే మరింత మంచిదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ విద్యా విధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ2020) పేరిట మార్గదర్శకాలను జారీ చేసింది.
కేంద్రం జారీ చేసిన ఆదేశాల్లో ప్రాథమిక విద్య పూర్తిగా మాతృభాషలో గానీ, ఆయా ప్రాంతాలకు చెందిన ప్రాంతీయ భాషల్లోనే జరగాలని విస్పష్టంగానే ప్రకటించింది. అంటే అంగన్ వాడీ విద్యతో పాటు 1 నుంచి 5 తరగతుల వరకు విద్యాభ్యాసం అంతా మతృభాషలోనే కొనసాగించాలన్న మాట. అంతేకాకుండా ఐదో తరగతి తర్వాత కూడా వీలయితే 8వ తరగతి దాకా కూడా మాతృభాషలోనే విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తే మంచిదని, 8వ తరగతి తర్వాత కూడా మాతృభాషలోనే విద్యా భ్యాసం కొనసాగితే మరింత మంచిదని కూడా కేంద్రం తన నివేదకలో పేర్కొంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల విషయంలో ఏపీలో మాత్రం సర్కారీ బడుల్లో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టి తీరతామని ప్రకటించిన జగన్ సర్కారుకు మాత్రం ఇబ్బందికరమైన పరిణామమేనని చెప్పక తప్పదు.
ఓ వైపు విపక్షాలు, మరోవైపు కోర్టులు కూడా ఆంగ్ల మాద్యమంపై ఇప్పటికే జగన్ సర్కారుకు పలు సలహాలు, సూచనలు చేశాయి. అంతేకాకుండా మాతృభాషలో ప్రాధమిక విద్యాభ్యాసం జరిగితేనే బాగుంటుందని కూడా పలువురు విద్యావేత్తలు కూడా చెప్పారు. అయితే ధనికుల పిల్లలు మాత్రమే ఆంగ్ల మాద్యమంలో చదివి అవకాశాలన్నీ ఎగురవేసుకుపోతూ ఉంటే.. తెలుగు మాద్యమంలో విద్యనభ్యసించే పేదల పిల్లలు… ఆ అవకాశాలకు దూరంగా ఉండాల్సిందేనా? అన్న వాదనను వినిపిస్తూ వస్తున్న జగన్ సర్కారు… ఇప్పుడు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలతో వెనకడుగు వేయక తప్పదన్న వాదన వినిపిస్తోంది. జాతీయ విద్యా విధానం అంటే… ఏ ఒక్క రాష్ట్రంలోనో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం చేసే విషయం కాదు. దేశవ్యాప్తంగా తప్పనిసరిగా అమలు చేసి తీరాల్సిన విషయం. మరి ఆంగ్ల మాద్యమంపై జగన్ ఎలా ముందుకు సాగుతారో చూడాలి.
This post was last modified on July 29, 2020 10:29 pm
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…
హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం…