ఒకప్పటి భారత ప్రధాని లాబ్ బహదూర్ శాస్త్రిని కలుద్దామని ఓ నాయకుడు ముందు చెప్పకుండా ఆయన ఇంటికి వెళ్తే.. బట్టలు ఉతుక్కుంటూ కనిపించారట. దీని గురించి జనాలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు.
కానీ ఇప్పటి మన నేతాశ్రీల నుంచి ఇలాంటి సింప్లిసిటీని ఊహించగలమా? కానీ చోటా నేతలు కూడా వందలు, వేల కోట్లకు పడగలెత్తి విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న ఈ రోజుల్లో కూడా ఓ ముఖ్యమంత్రి కొన్ని రోజులుగా తన బట్టలు తనే ఉతుక్కుంటున్నాడంటే షాకవ్వాల్సిందే.
ప్రస్తుత భారత దేశ ముఖ్యమంత్రుల్లో అత్యంత సింపుల్‌గా ఉండే నాయకుల్లో ఒకడిగా పేరున్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదే పని చేస్తుండటం విశేషం. ఈ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కొన్ని రోజుల కిందటే కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే.
ఐతే మన నాయకుల్లా చౌహాన్ వెంటనే కార్పొరేట్ ఆసుపత్రికి పరుగులు పెట్టేయలేదు. ముఖ్యమంత్రిగా తాను అందరికీ ఆదర్శంగా ఉండాలని, ప్రభుత్వ ఆసుపత్రులపై జనాల్లో నమ్మకం పెంచాలనే ఉద్దేశంతో అందులోనే చేరారు. అక్కడ ఆయన తన పనులన్నీ సొంతంగా చేసుకుంటున్నారట.
తాను వాడిన బట్టలు, వస్తువులు వేరొకరు ముట్టుకుంటే వారికి వైరస్ సోకుతుందన్న ఉద్దేశంతో ఆయనే స్వయంగా బట్టలు ఉతుక్కుంటున్నారట. ఈ విషయాన్ని ఆయన తన మంత్రులతో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో వెల్లడించారు.
ఆసుపత్రి నుంచే వర్చువల్ మీటింగ్ ద్వారా చౌహాన్ మంత్రిమండలి సమావేశం నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలామంది తమ బట్టలు తాము ఉతుక్కోవడాన్ని నామోషీగా భావిస్తారని.. కానీ తాను అలా భావించలేదని.. కొంత కాలం కిందట తన చేతికి శస్త్రచికిత్స జరిగిందని.. ఇప్పుడు బట్టలు ఉతకడంతో దానికి ఉపశమనం లభించిందని సమావేశంలో చమత్కరించడం విశేషం.
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…