నాయకులు.. సినిమా యాక్టర్లు అన్న తర్వాత వారిని అభిమానించే వారు.. ఆరాధించే వారికి కొదవ ఉండదు. కానీ.. వారందరికి కాస్తంత భిన్నంగా కనిపిస్తారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు. తమ నటుడు కమ్ నాయకుడి మీద వారు చూపించే అభిమానం రోటీన్ కు కాస్త భిన్నంగా ఉంటుంది. పవన్ ను ఆరాధించే చాలామంది.. ఆయన్ను తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తుంటారు. తమ ఇంట్లో మనిషిగా మాట్లాడుకోవటం కనిపిస్తూ ఉంటుంది. పవన్ కు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు.. ‘పెద్దోడు బాగా గడ్డి పెట్టాడు.. లేకపోతే ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటాడా’ అంటూ ఇంట్లో కొడుకు మాదిరి భావించేటోళ్లకు కొదవ లేదు.
పవన్ అంటే ఎందుకంత అభిమానం.. ఆయన్ను ఎందకంత పిచ్చిగా ప్రేమిస్తారు? అంటే.. ఆయన గుణగణాలే కారణంగా చెప్పాలి. రాజకీయంగా ఆయన్ను బోలెడన్ని విమర్శలు చేసేవారు.. బూతులు తిట్టే నేతలు సైతం వ్యక్తిగత సంభాషణల్లో మాత్రం ఆయన్ను వేలెత్తి చూపించేందుకు.. వంక పెట్టేలా వ్యాఖ్యలు చేసేందుకు జంకుతారు. అలాంటి వ్యక్తిత్వం పవన్ సొంతంగా చెప్పాలి. అదే.. ఆయనకు అంతమంది అభిమానుల్ని తెచ్చి పెట్టిందని చెప్పాలి.
పవన్ మీద అంత అభిమానాన్ని ఎందుకు ప్రదర్శిస్తారన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా పార్టీ ఆవిర్భావ సభకు వారాహితో ఊరేగింపుగా వెళుతున్న వేళ.. చోటుచేసుకున్న ఒక ఉదంతాన్ని ప్రస్తావించాల్సిందే. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లేందుకు వారాహి వాహనం మీద వెళుతున్న పవన్ ను.. వేలాది మంది ఆయన్ను బైకుల మీద అనుసరించటం తెలిసిందే.
అయితే.. అంచనాలకు మించిన వచ్చిన జనసందోహంతో విజయవాడ – మచిలీపట్నం హైవే మీద భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఇలాంటి వేళ.. ఒక అంబులెన్సు చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని గమనించిన పవన్ వెంటనే.. తన వారాహి వాహనాన్ని పది నిమిషాల పాటు నిలిపేశారు. అంబులెన్సు వెళ్లేందుకు వీలుగా దారి ఇవ్వటంతో పాటు.. దానికి ఎవరూ అడ్డు కాకూడదన్న విషయాన్ని అదే పనిగా చెప్పటం.. అందుకు తగ్గట్లే జనసైనికులు అంబులెన్సు వెళ్లేందుకు దారివ్వటం చూసినోళ్లు.. పవన్ మానత్వాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. ఇదే జనసేనాని గొప్ప మనసుకు నిదర్శనమని అభివర్ణిస్తున్నారు.
This post was last modified on March 15, 2023 10:43 am
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…