తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు.. కన్నా లక్ష్మీనారాయణకు టీడీ పీ అధినేత చంద్రబాబు భారీ టాస్క్ పెట్టారనే చర్చ పార్టీలో జరుగుతోంది. కన్నా ఎంట్రీతో టీడీపీ మరో రూపంలో పుంజుకుంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడు కన్నాకు చంద్రబాబు గట్టి హామీ ఇచ్చారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం దక్కించుకున్నాక.. కన్నాకు మంత్రి వర్గంలో సీటు ఖాయమని తెలుస్తోంది.
ఇక, ఇదే సమయంలో చంద్రబాబు కన్నాకు పెద్ద టాస్క్ పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు. త్వరలో నే కన్నా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.. కాపు సామాజిక వర్గంలో కదలిక తీసుకురావాలి. అదేసమయంలో కాపులకు టీడీపీ ప్రభుత్వం చేసిన పనులు..కాపు కార్పొరేషన్ ద్వారా.. చేసిన మేళ్లు.. వంటివి వివరించడం తోపాటు.. రాష్ట్రంలో కాపులను టీడీపీవైపు తిప్పే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.అదేసమయంలో తటస్థంగా ఉన్న కాంగ్రెస్ వాదులను కూడా టీడీపీవైపు మళ్లించే ప్రయత్నం చేయాలనిచూస్తున్నారట.
ఇదే విషయాన్ని కన్నా కూడా చెప్పుకొచ్చారు. తాను రావడంతో కేవలం గుంటూరు జిల్లాలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది రాజకీయ నేతలు.. టీడీపీవైపు చూస్తున్నారని అన్నారు. అయితే.. వారు చూస్తున్నారు బాగానే ఉన్నా.. దీనికి కదలిక మాత్రం కన్నా తీసుకువచ్చే ప్రయత్నం చేయనున్నా రని అంటున్నారు. నిజానికి ఇప్పటి వరకు టీడీపీలో కాపు నాయకులు చాలా మంది ఉన్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ హోం మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వంటివారు కీలకం.
అదేసమయంలో కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా కాపు వర్గంలో మంచి పేరున్న నేత. అయితే.. ఎవరు ఉన్నప్పటికీ.. ఒక ఊపు అయితే.. రావడం లేదు. చంద్రబాబు కాపులకు ఎంతో మేలు చేశామని చెబుతు న్నా.. ఆమేలును క్షేత్రస్థాయిలో వినిపించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఈ నేపథ్యంలో కన్నా.. వంటి బలమైన నేతను రంగంలోకి దింపి.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయించడం ద్వారా కాపులను టీడీపీవైపు ఆకర్షించే ప్రయత్నం చేసే టాస్క్‌ను చంద్రబాబు ఇచ్చారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
This post was last modified on February 24, 2023 4:20 pm
టాలీవుడ్ అనే కాక ఇండియన్ బాక్సాఫీస్‌లో ఈ వేసవి పెద్దగా ఉత్సాహం నింపలేకపోయింది. మామూలుగా సమ్మర్లో పెద్ద సినిమాలు రిలీజై…
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గకపోవడానికీ, తరచూ మళ్లీ మళ్లీ ఘర్షణలు చెలరేగడానికీ, అంతర్జాతీయ శక్తుల ఆడంబర నీతులు…
వైసీపీ హయాంలో పదవులు దక్కించుకున్న వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాడు నెలకు 3 లక్షలకు పైగానే వేతనాల రూపంలో…
నితిన్ కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. తమ్ముడు. ‘భీష్మ’ తర్వాత నితిన్‌కు ఓ మోస్తరు హిట్ కూడా లేదు. చెక్,…
జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందటే మళ్లీ ‘పవర్ స్టార్’గా మారారు. రాజకీయ నేతగా, మంత్రిగా…
ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ మెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత…