ఏ రాజకీయ పార్టీకైనా నాయకులు చాలా ముఖ్యం క్షేత్రస్థాయిలో కేడర్.. కీలక నేతల సహకారం.. లేకపోతే .. ఏ పార్టీ కూడా గెలుపు గుర్రం ఎక్కిన పరిస్థితి లేదు. అందుకే.. పార్టీ ఏదైనా కూడా నాయకుల విషయంలో ఒకింత ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఇది గతంలో ఉండేది. పార్టీలు నేతలపై భారం వేచి ఊరుకునేవి. తమ పని తాము చేసుకునిపోయేవి. నిర్ణయాలు తీసుకుని వదిలేయడం మినహా.. నేతలపై పెద్దగా ఒత్తిడి తెచ్చిన సందర్భాలు లేవు.
కానీ, ఇటీవల కాలంలో ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా.. టీడీపీ, వైసీపీల్లో నాయకులపై అపనమ్మకం పెరుగుతోంది. ఏమో ఏం చేస్తారో.. అనే బెంగ పార్టీల అధినేతలను పట్టిపీడిస్తోంది. ముఖ్యంగా ప్రజల్లో ఉండడం లేదేని.. ప్రజలకు అవసరమైన పనులు చేయడం లేదని.. పార్టీని పురోగతిలోకి తీసుకువెళ్లడం లేదని.. ఇలా కారణాలు ఏవైనా కూడా పార్టీల్లో నాయకులపై అపనమ్మకం పెరిగింది.
ఇది .. ఆయా పార్టీలకు మేలు చేస్తుందా? అంటే కాదనే అంటున్నారు పరిశీలకులు. నాయకులు ఆత్మ విశ్వాసంతో ఉంటేనే పార్టీలు పుంజుకుంటాయని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీని తీసుకుంటే.. తమకు ఏమాత్రం స్వేచ్ఛ లేదని నాయకులు పదే పదే చెబుతున్నారు. అయితే.. తాము చెప్పింది వినడమే తప్ప..మీరు ఏమీ మాట్లాడొద్దు అన్న విధంగా వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తోంది. ఇది.. పార్టీ నేతలకు మింగుడుపడడం లేదు.
అయితే ప్రత్యామ్నాయం లేకపోవడంతో నాయకులు కొనసాగుతున్నారు. ఇక, టీడీపీ విషయానికి వచ్చినా.. సేమ్ టు సేమ్. నేతలను సరైన దిశగా నడిపించేస్తున్నానని.. తాను చెప్పిందే వినాలని భావిస్తున్న చంద్రబాబు.. క్షేత్రస్థాయిలో నాయకుల మనో భావాలను పట్టించుకోవడం లేదు. దీంతో ఇటు టీడీపీపైనా నేతలకు నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల జయమంగళ వెంకటరమణ పార్టికి దూరమయ్యారు. సో.. మొత్తంగా చూసుకుంటే.. పార్టీలకు అపనమ్మకం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on February 18, 2023 11:11 pm
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…