మరో మూడు టర్మ్ లు మా నాయకుడు పాలించే సత్తా ఉందంటూ తరచూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానిస్తుంటారు. ఆయన ఆ మాటలు అనే ప్రతి సందర్భంలోనూ కేటీఆర్ కు ముఖ్యమంత్రిపదవి బదిలీ చేసే ప్రక్రియ జోరుగా సాగుతుందన్న ప్రచారం జరగటాన్ని అండర్ లైన్ చేసుకోవాలి. చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర యువరాజుగా టీఆర్ఎస్ దళాలు ముద్దుగా పిలుచుకునే కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గతంలో ఎప్పుడూ చూడనంత భారీగా శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.
సోషల్ మీడియాలో ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పేందుకు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు పోటీ పడటం గమనార్హం. ఎందుకిలా జరుగుతోంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఆరేళ్లు అవుతోంది. గతంలోనూ ఎన్నో పుట్టినరోజులు కేటీఆర్ జరుపుకున్నారు. ఎప్పుడూ లేని రీతిలో సోషల్ మీడియాలో ఇంత భారీగా విషెస్ రావటానికి కారణం కరోనాగా అనుకుంటే.. అన్నిరంగాలకు చెందిన వారు పోటాపోటీగా ట్వీట్లు చేయాల్సిన అవసరం ఏమిటి? అన్నది ఒక ప్రశ్న.
మాజీ మంత్రి గంటా లాంటి వారైతే.. కేటీఆర్ తో తాను సన్నిహితంగా ఉన్న ఫోటో పోస్టు చేస్తే.. కన్నడ రాజకీయాల్లో సమ్ థింగ్ స్పెషల్ గా ఉండే ప్రకాశ్ రాజ్ అయితే కేటీఆర్ ఎంతలా కష్టపడతారు.. మరెంతలా శ్రమిస్తారన్న విషయాన్ని అర్థమయ్యేలా ఒక వీడియోను పోస్టు చేసి దానికి పుట్టినరోజు శుభాకాంక్షల్ని చెప్పటం కనిపించింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా తమ విషెస్ ను చెప్పే ప్రయత్నం చేశారు.
ఇక.. అధికార పార్టీకి చెందిన నేతలు పలువురు రక్తదానాలు.. ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. కేటీఆర్ అంటే తమకెంత అభిమానమన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా చూసినప్పుడు ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోతుందని చెప్పటం తప్పే అవుతుంది. కాకుంటే.. ఒక రాజ్యానికి యువరాజును పట్టాభిషేకం చేసేందుకు జరిగే కసరత్తు భారీగా ఉంటుంది. ఇలా అనుకొని అలా చేసేయటం చాలా తక్కువ సందర్భాల్లోనూ.. ప్రత్యేక సమయాల్లోనే జరుగుతుంది. విడి సమయాల్లో వివిధ దశల్ని అధిగమించాల్సి ఉంది. ప్రస్తుతం కేటీఆర్ అలాంటి ప్రాసెస్ లో ఉన్నారు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న నేపథ్యంలోనే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయని చెప్పాలి.
This post was last modified on July 24, 2020 8:13 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…