Political News

జనసేనకు తెలియకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి?

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడుతున్న ఎమ్మెల్సీ మాధవ్ తాను బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఆయనే కాదు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ కూడా అదే మాట చెప్పారు. ఆయన మరో అడుగు ముందుకేసి 2024 ఎన్నికల్లో జనసేనతో కలిసి తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్ బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రంగంలో దిగారని ఆయన కూడా చెప్పారు.

అయితే… జనసేన నుంచి మాత్రం దీనిపై ఎలాంటి స్పందనా లేదు. రాష్ట్రంలో అన్ని విషయాలపై స్పందించే పవన్ కల్యాణ్ కానీ, ఆయన తరువాత పార్టీలో నంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ కానీ, నాగబాబు కానీ, ఇతర నాయకులు కానీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఎక్కడా మాట్లాడనే లేదు. ఎమ్మెల్సీ మాధవ్ తమ అభ్యర్థి అని చెప్పలేదు.. ఆయనకు ఓటేయమని పట్టభద్రులను కోరలేదు.

కానీ, బీజేపీ నేతలు మాత్రం తమ అభ్యర్థి జనసేన మద్దతుతో బరిలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. వైసీపీ, టీడీపీ లాంటి కుటుంబ పార్టీల పాలనకు చరమగీతం పాడాలన్న సునీల్ ధేవదర్. ఏపీని పునర్ నిర్మించడం బీజేపీ, జనసేనకే సాధ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ పార్టీలను ప్రజలు నమ్మరని అన్నారు. ఆ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. ఆ రెండు పార్టీలకు ప్రజలు ఓట్లు వేయరని తెలిపారు.

ఇదంతా బాగానే ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేన నుంచి ఎలాంటి ప్రకటన లేకుండానే తమ అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి. విశాఖలోని స్థానిక జనసేన క్యాడర్ కూడా మాధవ్ విషయంలో ఏమీ స్పందించలేదు. కానీ.. బీజేపీ నేతలు మాత్రం ఉమ్మడి అభ్యర్థి అంటూ ఊదరగొడుతున్నారు.

This post was last modified on February 14, 2023 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారి గురుంచి ఆరా తీస్తున్న జ‌గ‌న్‌

వైసీపీ హ‌యాంలో ప‌దవులు ద‌క్కించుకున్న‌ వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాడు నెల‌కు 3 ల‌క్ష‌ల‌కు పైగానే వేత‌నాల రూపంలో…

3 minutes ago

‘తమ్ముడు’కి ఎన్నెన్ని కష్టాలో…

నితిన్ కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. తమ్ముడు. ‘భీష్మ’ తర్వాత నితిన్‌కు ఓ మోస్తరు హిట్ కూడా లేదు. చెక్,…

15 minutes ago

ఓజీకే ఊగిపోతుంటే.. ఉస్తాద్‌ కూడానట

జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందటే మళ్లీ ‘పవర్ స్టార్’గా మారారు. రాజకీయ నేతగా, మంత్రిగా…

43 minutes ago

సినీ పితామహుడుగా జూనియర్ ఎన్టీఆర్ ?

ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ మెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత…

1 hour ago

రోహిత్ శర్మ… ఒక్క ఫోటోతో పొలిటికల్ అలజడి!

ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవడం…

2 hours ago

గోవింద‌ప్ప‌కు జైలు.. ఇక నోరు విప్పడమే తరువాయి

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ స్కాంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నిందితుడు(ఏ-33)కి విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్…

2 hours ago