ఏపీలో రాజకీయాల వేడి తగ్గడం లేదు. ముఖ్యంగా అధికార పార్టీలో నేతల అసంతృప్తి.. ఎక్కడా చల్లారడం లేదు. ఒకరు తర్వాత ఒకరుగా సెగలు కక్కుతూనే ఉన్నారు. నెల్లూరు వివాదం ముగిసిందిలే అనుకునే లోపు మైలవరం వివాదం తెరమీదికి వచ్చింది. దీనిని చక్కదిద్దారో లేదో.. తెల్లారేసరికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొలిటికల్ మంటలు ఓ రేంజ్‌లో రాజుకున్నాయి. ప్రకాశం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం చీరాల.
ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్ , ఆయన సోదరుడు స్వాములు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అయితే.. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఆమంచికి టికెట్ లేదని.. వైసీపీ తేల్చి చెప్పింది. అయితే.. ఆయనకు అన్యాయం చేయకుండా.. పరుచూరు నియోజకవర్గానికి పంపించింది. అయితే.. ఇది తమకు కలిసి వచ్చే నియోజకవర్గం కాదని.. తాము గెలిచే పరిస్థితి లేదని .. ఆమంచి సోదరులు చెబుతున్నారు. అయినా.. వైసీపీ అధినేత పట్టించుకోలేదు.
పైగా.. ఆమంచి ప్రత్యర్థి.. ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాంకు వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉండడాన్ని ఈ సోదరులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజకీయం వేడెక్కించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో స్వాములు ఉన్న అతి భారీ ఫ్లెక్సీ ఒకటి చీరాల సెంటర్‌లో దర్శన మిచ్చింది. రాత్రికి రాత్రి ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీపై.. మూడో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని.. యువత పెద్ద ఎత్తున తరలిరావాలని.. కూడా రాసి ఉండడం గమనార్హం.
ఈ పరిణామంతో వైసీపీ నాయకులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అసలు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమంచి బ్రదర్స్‌కు స్థానికంగా మంచి పట్టుంది. 2014 ఎన్నికల్లో ఆమంచి ఇండిపెండెంట్‌గానే పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అదేవిధంగా.. గత ఏడాది జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల్లో నూ వైసీపీ తన వారికి మద్దతు ఇవ్వకపోయినా ఇండిపెండెంట్లుగా నిలబెట్టి కృష్ణమోహన్ గెలిపించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు జనసేన ఫ్లెక్సీ వెలవడం.. దీనిలో స్వాములు పవన్ పక్కనే నిలబడి ఉండడం వంటి పరిణామాలను గమనిస్తే.. అన్నదమ్ములు రూటు మార్చుకుంటున్నారేమో.. అనే సందేహాలకు అవకాశం ఇచ్చినట్టు అయింది. మరి దీనిపై వైసీపీ ఏం చేస్తుందో చూడాలి. మొత్తానికి ఈ ఫ్లెక్సీ.. రాజకీయంగా వైసీపీని ఒక్కసారిగా కుదిపేసింది.
This post was last modified on February 11, 2023 3:40 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…